బోడుప్పల్(హైదరాబాద్): ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ రాజీవ్‌నగర్‌కు చెందిన కె. స్వప్న(26) ప్రైవేట్ ఉద్యోగిని. ఈ నెల 15న ఆఫీసు వెళ్లి జీతం తీసుకుని వస్తానని చెప్పిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.