సాక్షి, హైదరాబాద్ : సొంత పనుల నిమ్మిత్తం నడుచుకుంటూ వెళుతున్న మహిళను నెంబర్ ప్లేట్ లేని కారు ఢీకొట్టిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పులికంటి సంగీతారెడ్డికి తీవ్ర గాయాలవడంతో దగ్గర్లోని ఆర్.బీ.ఎమ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఉదంతం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోడుప్పల్‌కి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సంగీతారెడ్డిలు భార్యభర్తలు. కొంతకాలంగా భర్త, అత్తింటివారితో సంగీతకు విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా నెంబర్‌ప్లేట్ లేని వాహనం సంగీతను గాయపరచడం పోలీసులకు అనుమానం కలిగిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment