Hyderabad Banjara Hills Road Accident Today: GHMC Worker Died After Hit By Car - Sakshi
Sakshi News home page

Banjara Hills Road Accident: క్యాబ్‌.. వాటర్‌ట్యాంకర్‌ మధ్య నలిగి జీహెచ్‌ఎంసీ కార్మికుడి దుర్మరణం 

Published Fri, Apr 15 2022 8:07 AM | Last Updated on Fri, Apr 15 2022 10:50 AM

Hyderabad: GHMC Worker Died After Hit By Car At Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: కారు ఢీకొన్న ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ కార్మికుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌ ఎదురుగా రోడ్డు మధ్యలో చెట్లకు జీహెచ్‌ఎంసీ వాటర్‌ ట్యాంకర్‌తో చిన్నబోయిన కిరణ్‌ (23) నీరు పడుతున్నాడు.

అదే సమయంలో సాగర్‌ సొసైటీ వైపు నుంచి క్యాబ్‌ డ్రైవర్‌ జానయ్య అతివేగం, నిర్లక్ష్యంతో దూసుకొచ్చాడు. మొక్కలకు నీరు పడుతున్న కిరణ్‌ను ఢీకొట్టాడు. వాటర్‌ ట్యాంకర్, క్యాబ్‌ మధ్యన నలిగి కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: Hyderabad: ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement