Banjara hills road no 2
-
మొక్కలకు నీరు పడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, బంజారాహిల్స్: కారు ఢీకొన్న ప్రమాదంలో జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్ ఎదురుగా రోడ్డు మధ్యలో చెట్లకు జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్‌తో చిన్నబోయిన కిరణ్ (23) నీరు పడుతున్నాడు. అదే సమయంలో సాగర్ సొసైటీ వైపు నుంచి క్యాబ్ డ్రైవర్ జానయ్య అతివేగం, నిర్లక్ష్యంతో దూసుకొచ్చాడు. మొక్కలకు నీరు పడుతున్న కిరణ్‌ను ఢీకొట్టాడు. వాటర్ ట్యాంకర్, క్యాబ్ మధ్యన నలిగి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం: ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్‌లో కారు బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌లో మరో కారు బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి బంజారాహిల్స్‌లో అడీ కారు అధిక వేగంతో వెళ్తూ డీవైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం ఆ పక్కనే వెళ్తున్న రెండు బైకులను డీ కొట్టింది. ఆ ప్రమాదంలో బైక్‌లపై నుంచి ముగ్గురు వ్యక్తులు కింద పడ్డారు. ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కారులోని యువకుడు, అతడి గర్ల్‌ఫ్రెండ్ కారును వదిలి అక్కడి నుంచి పరారైయ్యారు. ఇంతలో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆడీ కారును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమారుడి మృతి కారణమైన యువకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి తండ్రి కుటుంబ సభ్యులతో వచ్చి బంజారాహిల్స్ పోలీసులను డిమాండ్ చేశారు. ఆ క్రమంలో పోలీసుస్టేషన్ వద్ద మృతుని బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.