బోడుప్పల్ (హైదరాబాద్) : ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్(19) మల్లాపూర్ మల్లికార్జున్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్థాపం చెందాడు.
సోమవారం ఉదయం బోడుప్పల్ బొల్లిగూడలోని నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రేమ విఫలమై ఆత్మహత్య
Published Mon, Nov 2 2015 6:26 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement