బోడుప్పల్: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో గురువారం సాయంత్రం ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. గమనించిన స్థానికులు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు రూ.36,450 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.