పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బోడుప్పల్ (హైదరాబాద్) : పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరిలో నివసించే యుగంధర్(35) గత కొంత కాలంగా చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలున్నారు.
కాగా పర్వతాపూర్ ఇంద్రప్రస్థానంలో నివసించే ఓ యువతితో ఫోన్‌లో పరిచయం చేసుకొని.. కొంత కాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకోమని కోరగా తనకు గతంలో పెళ్లి అయ్యిందని చెప్పి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం సాప్ట్‌వేర్ ఉద్యోగిని రిమాండ్‌కు తరలించారు.