కర్ణాటక: జిల్లాలోని ముళబాగిలు తాలూకా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు వద్ద హైటెక్ వేశ్యావాటికపై ముళబాగిలు పోలీసులు దాడి జరిపి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కార్యాచరణలో 6 మంది మహిళలను రక్షించారు. కార్యాచరణపై కోలారు జిల్లా ఎస్పీ ఎం నారాయణ వివరాలు అందించారు. ఈ మహిళలను హైదరాబాద్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రెస్టారెంట్ యజమానులతో కలిసి వేశ్యావాటికను నడుపుతున్నాడని తెలిపారు.
ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ యజమాని, మేనేజర్, సప్లయర్, రిసెప్షనిస్ట్, మహిళలను తీసుకొచ్చిన ఏజెంట్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏజెంట్ విజయ్, మంజునాథ్, అంజప్ప, సతీష్‌లను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని చంద్రహాస్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాడి సమయంలో రూ.5,56,300 నగదు, రూ.2 కోట్ల విలువ చేసే 10 కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ వేశ్యావాటికతో పాటు డ్యాన్స్ కూడా ఆడించేవారని తెలిపారు.
విజయవాడ, చిత్తూరు, విశాఖ పట్టణం నుంచి మహిళలను తీసుకువచ్చే వారని తెలిసిందన్నారు. సతీష్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశాడని, మహిళలంతా 20, 21, 23, 24 ఏళ్ల వయసు వారేనని, వారిని సఖి సాంత్వన కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముళబాగిలు తాలూకా హెచ్.బయప్పనహళ్లి సమీపంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్టులో రాక్ వ్యాలీ బార్ అండ్ రెస్టారెంట్ గదుల్లో మహిళలను ఉంచి వేశ్యావాటికను నిర్వహిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని రచించి దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment