ఆన్‌లైన్ ద్వారా హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) అధికారులు.. ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
చందానగర్ : ఆన్‌లైన్ ద్వారా హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) అధికారులు.. ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కథనం మేరకు.. పాతబస్తీ వాసి మాలిక్ ముంబై, కోల్‌కతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఏపీహెచ్‌బీ కాలనీలోని గ్రీన్ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించి, ఒక రాత్రికి రూ.10 వేల చొప్పున వసూలు చేసేవాడు.
దీనిపై కమిషనర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందడంతో, ఆయన ఆదేశాల మేరకు ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కుషాల్‌కర్, ఎస్సై రమేశ్ ఆదివారం గెస్ట్‌హౌస్‌పై దాడి చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన శుభంరాజ్ శర్మ (22), ప్రమోద్ పాటిల్(33), శ్రీరామమూర్తి (24), వెంకటేశ్వరరావు(29), రోషన్‌కుమార్ యాదవ్(27), రాజ్‌మిశ్రా(24)లతో పాటు టోలిచౌకికి చెందిన మజర్ ఉల్లాఖాన్ సమీర్(27) పట్టుబడ్డారు.
వీరితో పాటు కోల్‌కతాకు చెందిన యువతులు రీముహజ్రా, తృప్తిదత్తాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్, రూ.3 వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మాలిక్ పరారీలో ఉండగా, పట్టుబడ్డ యువతులను రెస్క్యూహోమ్‌కు తరలించారు.