భాగ్యన గర్ కాలనీ: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యనగర్‌కాలనీలోని హోటల్ వన్‌ప్లస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. విటులు బి. ఓంప్రకాష్ (30), ప్రశాంత్‌రెడ్డి (24), కె.ప్రీతం (24), జి.విశ్వనాథ్ (24), మురళి (28)లతో పాటు ఇద్దరు వ్యభిచారిణులను అరెస్టు చేశారు.