kukatpally police
-
కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!
కేపీహెచ్‌బీకాలనీ: యువతులను ఎరగా వేసి..యువకులను ఆకర్షించి దోపిడీలకు పాల్పడుతున్న 14 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద 13 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఆటోను స్వా«దీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ వారసిగూడ ప్రాంతానికి చెందిన గంధం విశాల్, రామంతాపూర్‌కు చెందిన భాజిని నవీన్, రాము, ఉప్పల్ గణేశ్‌నగర్‌కు చెందిన శైలజ, చెరుకూరి స్వాతి, వికాస్, సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన గుండె నవీన్, బీరం మధు, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, సయ్యద్ మరియ, జమిలి శివకుమార్, దుర్గలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముఠాలోని యువతులను యువకులపైకి ఎరవేసి ఆకర్షిస్తారు. అనంతరం అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదిన నవీన్ అనే వ్యక్తి..తనపై పలువురు దాడికి పాల్పడి గాయపర్చారంటూ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. తమను ఫోటోలు తీశావంటూ నిందిస్తూ తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని నవీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది జరిగిన మరుసటి రోజు 4వ తేదీన నిజాంపేట గ్రామానికి చెందిన కాసర్ల వేణు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. అక్కడ టిఫిన్ పార్శిల్ చేయించుకొని తిరిగి వస్తుండగా అతని బైక్‌ని ఓ యువతి ఆపింది. (చదవండి: హైదరాబాద్: వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికే కోమాలోకి) ఆమె మాటలకు ఆకర్షితుడైన వేణు తన గదికి తీసుకువెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లోని ఓ ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు డ్రా చేసేందుకు ఆగాడు. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి బయటకు వచ్చేసరికి గుర్తు తెలియని ఒక మహిళతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఒక్కసారిగా వేణుపై దాడికి దిగారు. అతడిని తీవ్రంగా గాయపర్చి రెండు తులాల బంగారు గొలుసు, 4.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని దోచుకెళ్లారు. బాదితుడు వేణు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దృష్టికి వచి్చన రెండు కేసులకు సంబంధించి ఒకటే ముఠా చేసి ఉంటుందని అనుమానించారు. బాధితుడు వేణు నుంచి దాడికి పాల్పడిన వారి ఆనవాళ్లను సేకరించారు. అలాగే వారు వచి్చన ఆటో నెంబర్‌పై ఆరా తీయగా చివరి మూడు నెంబర్లు 258గా వేణు తెలిపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ అండర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెళుతున్న ఆటోను ఆపి విచారించారు. ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి అడగ్గా చూపించలేదు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. మొత్తం 14 మంది ముఠాలో విశాల్, బి.నవీన్, శైలజ, స్వాతి, నవీన్, మధు, సయ్యద్ మరియా, శివకుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాము, వికాస్, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, దుర్గల కోసం గాలిస్తున్నారు. (చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది) -
బౌన్స్ స్కూటీల దొంగ అరెస్ట్
మూసాపేట: పార్కింగ్ చేసిన స్కూటీలను దొంగిలించి అమ్ముతున్న దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఔసలి నరేష్ (28), శంకర్‌పల్లిలోని మైతాబ్ ఖాన్‌గూడలో నివాసముంటున్నాడు. 2018 నుంచి 2020 వరకు బౌన్స్ ద్విచక్ర వాహనాల కంపెనీలో టెక్నికల్ వింగ్‌లో పని చేసి ఆ తర్వాత మైతాబ్‌ఖాన్‌గూడలో మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి స్టేషన్ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పరిధిలో 2 వాహనాలను దొంగిలించి తన షెడ్డుకు తరలించాడు. గతంలో కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో పార్కింగ్ చేసిన వాహనాల జీపీఎస్ తొలగించి సులువుగా వాహనాన్ని దొంగిలించి తన షెడ్డుకు తరలించేవాడు. మూడు వాహనాలను బౌన్స్ స్టిక్కర్ తొలగించి, రంగు మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల దొంగిలించిన మరో వాహనానికి జీపీఎస్ తొలగించకుండా షెడ్డులో ఉంచి ఊరికెళ్లాడు. డీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎల్లస్వామి, పరమేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో జీపీఎస్ ద్వారా మైతాబ్‌ఖాన్‌గూడకు వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకుని నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
పోలీసులు వస్తున్నారని భవనం పైనుంచి దూకి..
కేపీహెచ్‌బీ కాలనీ: జూదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారంటూ అరుపులు వినిపించడంతో గదిలో ఉన్న యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకగా, మరికొందరు రెండవ అంతస్తు నుంచి దూకారు. ఇందులో ఓ యువకుడు రోడ్డుపైకి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూసాపేట జనతానగర్‌లో నివాసం ఉండే మల్లేష్, లక్ష్మిలకు ఇద్దరు కొడుకులు, ఒక్క కుమార్తె. వీరిలో పెద్దకొడుకు ప్రవీణ్ అలియాస్ స్వామి(26) ఎంబీఏ వరకూ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్ స్థానికంగా ఉన్న మరికొందరు స్నేహితులతో కలసి ఓ యువజన నాయకుడి ఇంటి రెండవ అంతస్తులోని గదికి వెళ్లారు. అక్కడ కొందరు పత్తాలాడుతుండగా మరికొందరు వారితో ముచ్చటిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్వోటీ పోలీసులు వచ్చారన్న అరుపులు విన్న గదిలోని యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పరుగులు పెట్టగా, రెండవ అంతస్తులోనే ఉన్న ప్రవీణ్‌కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అక్కడ్నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంతారావు అనే మరో యువకుడు సైతం పక్క భవనంపైకి దూకడంతో అతని కాలుకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే, అతని ఆచూకీ కూడా తెలియడంలేదు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎస్వోటీ పోలీసులు రైడ్‌కు వెళ్లలేదని, అలాంటి సమాచారం తమకు లేదంటున్నారు కూకట్పల్లి పోలీసులు. పోలీసులు వస్తున్నారన్న పుకార్లతోనే యువకులు భయాందోళనకు గురై భవనంపై నుంచి దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆ భవనం వద్దకు వచ్చిన తరువాతే అలజడి నెలకొందంటున్నారు. మృతిచెందిన ప్రవీణ్ తమ్ముడు క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కూకట్పల్లి పోలీసులు తెలిపారు. -
రాధిక ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వీ6 న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక ఆత్మహత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. రాధిక తన ఫోన్ ద్వారా నెల రోజులుగా ఎవరెవరితో సంభాషించిందనే కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర ఒత్తిళ్లయినా ఉన్నాయా? అనే కోణంలో దృష్టి సారించారు. రాధిక ఇంటి సమీపంలో ఉండే స్నేహితులు, పరిచయస్తులతో పాటు కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉండేదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. మూసాపేటలో శ్రీసువిల అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా రాధిక తన తండ్రి, కుమారుడు, సోదరితో ఉంటోంది. ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు పొందిన రాధిక ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. రాధిక గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోందని సహ ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాధిక రాత్రి 10.40 నిమిషాల సమయంలో అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపైకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్‌మన్ అపార్ట్మెంట్లోని వారికి సమాచారమిచ్చాడు. ముఖం ఛిద్రం కావడంతో తొలుత మృతురాలు ఎవరనేది గుర్తించలేకపోయారు. రాధిక సోదరి వచ్చి మృతురాలిని గుర్తించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ‘నా బ్రెయినే నా శత్రువు’అంటూ రాధిక రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా, రాధిక మృతదేహానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
తాళాలు వేసిన ఇల్లే టార్గెట్
-
కూకట్‌పల్లిలో దొంగల స్వైరవిహారం
హైదరాబాద్: కూకట్పల్లి బాలాజీనగర్‌లో ఎంఐజీ క్వార్టర్లలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మూడిళ్లలో దొంగలు చొరబడి రూ.3 లక్షల నగదుతోపాటు అరకిలో బంగారాన్ని ఎత్తుకుపోయారు. అడ్డు వచ్చిన ఒక మహిళను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
భాగ్యన గర్ కాలనీ: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను కూకట్పల్లి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యనగర్‌కాలనీలోని హోటల్ వన్‌ప్లస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. విటులు బి. ఓంప్రకాష్ (30), ప్రశాంత్‌రెడ్డి (24), కె.ప్రీతం (24), జి.విశ్వనాథ్ (24), మురళి (28)లతో పాటు ఇద్దరు వ్యభిచారిణులను అరెస్టు చేశారు. -
పోలీసుల పేరుతో హల్చల్: నలుగురి అరెస్టు
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): పోలీసులమంటూ రాత్రి వేళల్లో వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతి తెలిపిన వివరాలివీ.. విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ కరీం(22), మాధవరంనగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ (30), బాగ్అమీర్కు చెందిన ప్రవీణ్‌కుమార్ (24), మాధవరంనగర్కు చెందిన గోపాలకృష్ణ (30) స్నేహితులు. అయితే, రాత్రి సమయాల్లో వీరంతా మద్యం తాగి వాహనదారులను బెదిరింపులకు గురిచేసేవారు. బుధవారం రాత్రి పటేల్‌కుంట పార్కు సమీపంలో ద్విచక్ర వాహనదారులను ఆపి వాహనం పత్రాలు చూపించాలని, లేదంటే పక్కన ఎస్ఐ ఉన్నాడని బెదిరించేవారు. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టకు చెందిన రాజేష్ ఉషాముళ్లపూడి రోడ్డు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే క్రమంలో అతని బైక్ ఆపారు. అయితే, అతని వాహనం పేపర్లు అన్నీ సక్రమంగా ఉండటంతో హెల్మెట్లేదని వెయ్యి రూపాయలు అడిగారు. తన వద్ద డబ్బులు లేవు అనడంతో పర్సు తీయమన్నారు. పర్సులో ఉన్న 4 వేలతో పాటు అతని ఏటీఎం కార్డు లాక్కొని భాగ్యనగర్‌కాలనీలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి పిన్ నంబర్ అడిగారు. అతడు ఎంతకూ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో ఏటీఎం సెక్యూరిటీగార్డుతో వాదనకు దిగారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 వేలతో పాటు ఒక సెల్‌ఫోన్, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
బస్‌స్టాప్‌లో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ బస్‌స్టాప్ వద్ద దారణం చోటు చేసుకుంది. బస్‌స్టాప్‌లో మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.