వ్యభిచారం ముఠా గుట్టురట్టైంది.. | Prostitution gang caught by police at alwal | Sakshi
Sakshi News home page

వ్యభిచారం ముఠా గుట్టురట్టైంది..

Published Sun, Feb 14 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

Prostitution gang caught by police at alwal

అల్వాల్: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదివారం జరిగింది. సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...అల్వాల్ రామ్‌నగర్ భాటియా బేకరి సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి నిర్వహకులు కృష్ణమూర్తి, సత్యంలతో పాటు విటులు ఆనంద్‌షబాని, దాసరి ప్రసాద్, శ్రీనివాస్, 30 సంవత్సరాల యువతిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి నుంచి 9 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement