alwal police
-
షాపుకు నిప్పు పెట్టబోయి..
-
వ్యభిచారం ముఠా గుట్టురట్టైంది..
అల్వాల్: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదివారం జరిగింది. సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...అల్వాల్ రామ్‌నగర్ భాటియా బేకరి సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి నిర్వహకులు కృష్ణమూర్తి, సత్యంలతో పాటు విటులు ఆనంద్షబాని, దాసరి ప్రసాద్, శ్రీనివాస్, 30 సంవత్సరాల యువతిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
హైదరాబాద్: నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని... వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి... నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం. -
గజ దొంగ అరెస్ట్
హైదరాబాద్: వరుస చోరీలతో కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఓ దొంగను ఎట్టకేలకు అల్వాల్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చోరీలతో పోలీసులు అప్రమత్తమై పటిష్ట నిఘా పెట్టగా... దొంగ పట్టుబడినట్లు సమాచారం. అతడి నుంచి 84 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగ 12 చోరీ కేసుల్లో నిందితుడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.