నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్ | Fake IAS Officer arrested in alwal police | Sakshi
Sakshi News home page

నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్

Published Sat, Jun 13 2015 11:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్ - Sakshi

నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్

హైదరాబాద్: నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని... వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి... నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు.

దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement