raghavendra reddy
-
అప్పుడు మేం సక్సెస్ అయినట్లే: రాఘవేంద్ర రెడ్డి
ఇంద్రసేన హీరోగా వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ బకుని హీరోయిన్. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రైటర్ అవ్వాలనుకున్నాను. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులభం కాదని తెలిసింది. దీంతో సినిమా జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, టీవీ చానెల్స్‌కు శాటిలైట్ కన్సల్టెంట్‌గా చేశాను. ఇలా ఇండస్ట్రీలో నాకంటూ కొంత గుర్తింపు లభించడంతో రచయితగా కెరీర్ ఆరంభించాలనుకున్నాను. నా ఫ్రెండ్ ఇంద్రసేన కోసమే ఈ సినిమా కథ రాశాను. రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసినప్పటికీ ఇది ఏ రాజకీయ పార్టీ గురించిన సినిమా కాదు. ‘శాసనసభ’ అంటే పవిత్రమైన దేవాలయంతో సమానం. అటువంటి శాసనసభ గొప్పతనాన్ని ఈ తరంవారికి ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాను. యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటర్లు పవిత్రమైన ఓటును అమ్ముకోకూడదు. ఈ సినిమా వల్ల కనీసం కొంతమంది ఆలోచించినా, ఇద్దరు, ముగ్గురు మారినా మేం సక్సెస్ అయినట్లుగా భావిస్తాను. దర్శకుడు వేణు ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ఇక నేను ఏ జానర్లో అయినా కథలు రాయగలను. అయితే కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుంటాను. ప్రస్తుతం ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఓ క్రైమ్ సబ్జెక్ట్‌కు కథలు అందించాను’’ అని అన్నారు. -
‘శాసనసభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శాసనసభ నటీనటులు: ఇంద్రసేన, డా.రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ బకుని, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్, వేణు మండికంటి తదితరులు నిర్మాతలు: తులసీరామ్సాప్పని, షణ్ముగం సాప్పని కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్: రాఘవేంద్రరెడ్డి దర్శకత్వం: వేణు మడికంటి సంగీతం: రవి బసూర్ విడుదలతేది: డిసెంబర్ 16, 2022 అసలు కథేంటంటే: ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఎలాగైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నించగా.. ఈ సారి తానే సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యేలకు డిమాండ్ ఏర్పడుతుంది. వారిని కొనడం కోసం రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. అందులో భాగంగా బేరసారాల్లో ఆరితేరిన దుర్గా(అమిత్ తివారి)ని జైలులో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో దుర్గాని సూర్య(ఇంద్రసేన) కాపాడుతాడు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్య ఎవరు? స్వతంత్ర ఎమ్మెల్యేలను సూర్య ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నారాయణ స్వామి( రాజేంద్రప్రసాద్)తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. జర్నలిస్ట్‌గా, శాటిలైట్ కన్సల్టెంట్‌గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ కథను రాసుకున్నాడు. రాఘవేంద్రరెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానిని అనుకున్న విధంగా తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. ఇక కీలకమైన సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కథనం అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘ఓటేసే రోజునే వాడు రాజు..ఆ తర్వాత ఐదేళ్లు నేనే రాజు..నేనే మంత్రి’, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకున్న ఓటర్ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది’ ప్రతి వాడు యుద్దంలో గెలవాలనే చూస్తాడు. కానీ ఎవరో ఒకడు మాత్రమే గెలుస్తాడు..వాడినే వీరుడు అంటారు’లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్‌ని కూడా కాస్త ఆసక్తికరంగా, ల్యాగ్ లేకుండా తీర్చిదిద్ది ఉంటే.. శాసన సభ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచేది. ఎవరెలా చేశారంటే: ఇక నటీనటులు విషయానికొస్తే.. సూర్య పాత్రలో ఇంద్రసేన మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నారాయణ స్వామి పాత్రకి ఆయన జీవం పోశాడు. ముఖ్యమంత్రిగా అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రవి బసూర్ సంగీతం, రాఘవేంద్రరెడ్డి స్క్రీన్‌ప్లే,మాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?
‘ఓటుకు కోట్లు’ కేసులో నలుగురు టీడీపీ నేతలను ప్రశ్నించిన ఏసీబీ * ‘ముఖ్య’ నేతలు అప్పగించిన పనిపై ఆరా * అదే కోణంలో రేవంత్ డ్రైవర్‌కూ ప్రశ్నలు... వారి నుంచి కొంత సమాచారం సేకరణ * నేడూ కొనసాగనున్న విచారణపర్వం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అసలు సూత్రదారులపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అందుకు అనుగుణంగా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. సూత్రదారుల వ్యూహాలేంటి, ఏయే సమయాల్లో ఎలాంటి ప్రణాళికలు రచించారనే అంశాలపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు యాదవ్‌లతోపాటు రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్రెడ్డిని ఏసీబీ సోమవారం సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ విచారణపర్వం సాగింది. ఏసీబీ అధికారులు ఐదుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి వారి పాత్రలకు సంబంధించిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఫోన్ల నుంచి వీరికి కీలక సమయాల్లో కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ గుర్తించింది. అందుకు అనుగుణంగా టీడీపీకి చెందిన నలుగురిని పిలిచి విచారించింది. పదే పదే ఫోన్లు చేయడానికి గల కారణమేంటి? ‘ముఖ్య’నేతలు అప్పగించిన పనేంటి? ఎమ్మెల్యేల కొనుగోళ్లలో మీ పాత్ర ఏంటి? అనే కోణంలో పలు ప్రశ్నలు సంధించి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అలాగే ముఖ్య నేతలతోగల పరిచయాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే వారి నుంచి మరింత సమాచారం సేకరించడం కోసం ఐదుగురినీ మంగళవారం కూడా విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆదేశించింది. కుట్రను అమలు చేసే పాత్రధారులు..! ఎమ్మెల్యేల కొనుగోలుకు పన్నిన కుట్రను అమలు చేసేందుకు టీడీపీ అధినాయకత్వం కొంత మంది పాత్రధారులను ఎంపిక చేసినట్లు ఏసీబీ భావిస్తోంది. మే 31న తాము ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేలకు ముడుపులు చేరవేసేందుకు ఆ పార్టీ పెద్దలు కొందరిని నియమించుకున్నట్లు ఏసీబీ వద్ద సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఒక్కొక్క విభాగాన్ని కొంత మందికి అప్పగించినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే కీలక సమయాల్లో ముఖ్య నేతల నుంచి కొందరికే పదేపదే ఫోన్‌కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ అనుమానిస్తోంది. ఇటీవలి కాలంలో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను విచారించగా ఈ కొత్త ముఖాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వాటి ఆధారంగానేప్రదీప్చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావుల విచారణ సాగినట్లుగా తెలుస్తోంది. -
ఓటుకు కోట్లు కేసులో ఐదుగురిని విచారించిన ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు మరో ఐదుగురిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రధాన అనుచరుడు ప్రదీప్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలతో పాటు తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన పుల్లారావు, మనోజ్, సుధీర్లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం వీరు ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బు వ్యవహారం, ఇతర కీలక అంశాల గురించి వీరిని ప్రశ్నించారు. రేపు కూడా ఏసీబీ అధికారులు వీరిని విచారించనున్నారు. -
నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
హైదరాబాద్: నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని... వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి... నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం. -
విద్యార్థుల అభివృద్ధికి బంగారు బాటలు
నెల్లూరు(రెవెన్యూ): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల అభివృద్ధికి బంగారు బాటలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన మార్గదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. చైర్మన్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు రాబోవు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే విధంగా రూ.6.50 లక్షల వ్యయంతో మార్గదర్శిని రూపొందించామన్నారు. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిషు మీడియం చదువుతున్న 22,700 మంది విద్యార్థులకు మార్గదర్శిని అందిస్తామన్నా రు. విద్యార్థులందరూ మార్గదర్శినిని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధిం చాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల్లో మొదటి మూడు ర్యాంక్‌ల్లో నిలిచిన విద్యార్థులకు తన సొంత నిధులు రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజే స్తామన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వికలాంగ విద్యార్థులకు రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, వాత్సల్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన ఇద్దరిని కార్పొరేట్ కళశాలల్లో ఇంటర్ పూర్తి చేసేంత వరకు తన సొంత నిధులు కేటాయిస్తాని ప్రకటించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం 11 మంది సొంత నిధులు వెచ్చించి విద్యా వలంటరీలను నియమించామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలన్నారు. అత్యధిక ర్యాంకులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతు లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు మార్గదర్శిని పుస్తకాలు అందజేశారు. మార్గదర్శిని పుస్తకం రూపొందించిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు అందజేశారు.