
ఒకప్పుడు కామెడీ అంటే నవ్వుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడేమో కామెడీ అంటే ప్రతిదీ డబుల్ మీనింగ్ లేదంటే బూతు అన్నట్లు మారిపోయింది. టీవీ షోల్లోనూ మహిళల్ని కించపరిచేలా కామెడీ పేరుతో పంచులు వేస్తూనే ఉండటం మీరు చూసే ఉంటారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ కూడా వ్యభిచారంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కూల్ ప్రొఫెషన్ అని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది.
(ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!)
సోషల్ మీడియా పుణ్యమా అని గత కొన్నాళ్ల నుంచి స్టాండప్ కమెడియన్స్ డిమాండ్ పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో ఆయా కమెడియన్స్ ఫేమస్ అయిపోతున్నారు. అయితే తమకు వస్తున్న ఆదరణ చూసి కొన్నిసార్లు నోరు జారేస్తున్నారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ అలానే అనేసింది. 'వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్. వేరు చూసి చూడటం లాంటి ఏం ఉండవు. ఫ్రెషర్స్ కి కూడా అందులో జాబ్స్ దొరుకుతాయి' అని చెప్పుకొచ్చింది.
అయితే ఈమె వ్యాఖ్యలపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని విదూషిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment