ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యభిచారం | police attacks on Prostitution gang | Sakshi
Sakshi News home page

ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యభిచారం

Published Wed, Nov 25 2015 1:41 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

police attacks on Prostitution gang

బెల్లంపల్లి: ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయం పేరుతో ఓ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఓ ముఠా అందులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది.
 
సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళా నిర్వహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సంప్రీత్‌సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement