ముంబై: ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో రహస్యంగా నడిపిస్తున్న సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. తూర్పు గోరెగావ్లో గురువారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ముంబై పోలీసులు ఇద్దరు యువతులను రక్షించారు. అలాగే ఈ సెక్స్ రాకెట్‌కు యువతులను సరాఫరా చేస్తున్న ఓ నటిని, మోడల్‌ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గోరెగావ్‌లోని ప్లస్ స్టార్ హోటల్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో హోటల్‌పై దాడి చేశారు. చాలాకాలంగా హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందని సీనియర్ పోలీసు అధికారి దిండొషీకి.. గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో దానిని నిర్థారించి డీసీపీ జోన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో డిప్యూటీ కమిషనర్ డి స్వామి ఆపరేషన్‌ను నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా ... మొదట ఓ పోలీసు అధికారి మారువేషంలో కస్టమర్‌లా హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ రాకెట్‌లోని వ్యక్తిని పోలీసు అధికారి సంప్రదించగా. అతడు.. ఇద్దరు యువతలతో కలిసి హోటల్‌కు వచ్చాడు. దీంతో అతడిని అరెస్టు చేసి యువతులను రక్షించినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే ఈ దాడిలో ఈ వ్యభిచార ముఠాకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్న నటి అమృత ధనోవా(32), మోడల్ రిచా సింగ్‌ను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా రక్షించిన యువతుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. అరెస్టు చేసిన వారిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) 370(3),34 సెక్షన్ ప్రకారం అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment