అల్వాల్ (మల్కాజ్ గిరి): హైదరాబాద్ నగరంలో ఇండింపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకురాలిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కేరళకు చెందిన రోజీ అనే మహిళ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గృహంపై ఆదివానం దాడిచేసి ముగ్గురు మహిళలను, ఇద్దరు విటులను, నిర్వాహకురాలు రోజీని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు, ఒకరు సిద్ధిపేటకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కాగా, వీరందరు 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు చెప్పారు. వీరితో పాటు విటులు వెంకటరెడ్డి(50), యాదగిరి(30)లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.