సినిమా పేరుతో వ్యభిచారం: స్టంట్ మాస్టర్ అరెస్ట్ | Cinema Stunt Master arrested due to Prostitution case | Sakshi
Sakshi News home page

సినిమా పేరుతో వ్యభిచారం: స్టంట్ మాస్టర్ అరెస్ట్

Published Fri, Apr 4 2014 8:46 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

సినిమా పేరుతో వ్యభిచారం: స్టంట్ మాస్టర్ అరెస్ట్ - Sakshi

సినిమా పేరుతో వ్యభిచారం: స్టంట్ మాస్టర్ అరెస్ట్

తిరువొత్తియూరు : సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి యువతులను మోసం చేసి వ్యభిచారానికి దింపుతున్న స్టంట్ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తామని ఓ ముఠా యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
 
 పోలీసు కమిషనర్ జార్జి ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైంబ్రాంచ్ విభాగం అదనపు కమిషనర్ నల్లశివం, డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో వ్యభిచార నిరోధక విభాగం సహాయ కమిషనర్ గణపతి, ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా వేసింది. వడపళణిలోని ఒక స్టూడియో సమీపంలో ఉన్న విలాసవంతమైన ఇంటిలో తనిఖీ చేశారు. యువతులతో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న సినిమా స్టంట్‌మాస్టర్ బాంబే కుమార్‌ను, ఇతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న నలుగురు యువతులకు విముక్తి కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement