
బంజారాహిల్స్: ఆన్‌లైన్ వ్యభిచారం నడిపిస్తున్నారంటూ ఓ హిజ్రా ఇంటికి వెళ్లిన నలుగురు విలేకరులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... భారత్ తెలుగు న్యూస్‌లో న్యూస్ రిపోర్టర్ పి.సాయికిరణ్ రాజు, టీజీ 24/7 న్యూస్ రిపోర్టర్ కె.సంపత్ విజయ్ కుమార్, యాకుబ్‌పాషా, ప్రీలాన్స్ రిపోర్టర్ కె.ప్రశాంతి తదితరులు ఆదివారం అర్ధరాత్రి వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే హిజ్రా(26) ఇంటికి వెళ్లారు.
ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ ఆమెతో చెప్పగా అందుకు సదరు హిజ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగింది. రూ. 2 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తన సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని బాధిత హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విధాలా బెదిరించడంతో బాధితురాలు సహచర హిజ్రాలతో కలిసి ఈ నలుగురు విలేకరులను చితకబాది పోలీసులకు అప్పగించారు.
(చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు)
Comments
Please login to add a commentAdd a comment