‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’ | Minors Family Pushing Her Into Prostitution In Mumbhai | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేసిన మైనర్‌ బాలిక

Published Mon, Aug 19 2019 9:02 AM | Last Updated on Mon, Aug 19 2019 9:06 AM

Minors Family Pushing Her Into Prostitution In Mumbhai - Sakshi

సాక్షి, ముంబై: మానవ సభ్యసమాజం తలదించుకునే హృదయవిదారకర ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. మైనర్‌ బాలికకు బలవంతపు వివాహం చేసి, అనంతరం వ్యభిచార కూపంలోకి దింపారు ఆమె తల్లిదండ్రులు. ముంబై సమీపంలోని మాన్‌ఖర్థ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మాన్‌ఖర్థలో నివసిస్తున్న ఓ బాలికకు ఆమె కుటుంబ సభ్యులు ఏడాది క్రితం బాల్య వివాహం జరిపించి అమానవీయ ఘటన పాల్పడ్డారు. తనకు పెళ్లి ఇష్టం లేదన్నా వినకుండా 15 ఏళ్ల బాలికను 35 ఏళ్ల వయసు గల వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు.

అయితే అతనితో జీవించడానికి ఇష్టపడని ఆ బాలిక కొంత కాలం తరువాత తిరిగి పుట్టింటికి చేరుకుంది. అనంతరం ఆమె తల్లిదండ్రులు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ పోషణ కొరకు వ్యభిచారం చేయల్సిందిగా తల్లిదండ్రులు, ఆమె సోదరుడు బలవంతపెట్టారు. వారి వేధింపులను బరించలేని బాలిక సమీపంలోని పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, భర్త, సోదరుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వ్యభిచారం చేయాలంటూ బలవంతపెడుతున్నారని ఫిర్యాదు చేసింది. 

ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు బాలిక ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులు, సోదరుడు, ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. అయితే బాలిక సొంత సోదరుడు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారిపై పోక్స్‌, మైనర్‌ బాలికల వివాహ నిషేదిత చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై బాలిక 2018 ఏప్రిల్‌ 22న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితులను ఏడాది తరువాత అరెస్ట్‌ చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement