టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో' | T20 WC 2021: Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India Ahead Of Crucial Match Against New Zealand | Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs NZ: టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో'

Published Sat, Oct 30 2021 8:24 PM | Last Updated on Sat, Oct 30 2021 8:24 PM

T20 WC 2021: Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India Ahead Of Crucial Match Against New Zealand - Sakshi

Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐపీఎల్‌-2021కు ముందు జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్‌ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్‌ యూట్యూబర్‌ జార్విస్‌ అలియాస్‌ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్‌ మధ్యలో గ్రౌండ్‌లోకి వచ్చి ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్‌ పోలీసులు అరెస్ట్‌ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. 

టీమిండియాకు నా హెల్ప్ ఏమైనా కావాలా..? కిట్‌తో రెడీగా ఉన్నాను.. బరిలోకి దిగడమే తరువాయి అంటూ టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరించిన సెల్ఫీని పోస్టు చేశాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. జార్వో ట్వీట్‌పై టీమిండియా అభిమానులు స్పందిస్తున్నారు. జార్వో ఉంటే టీమిండియాకు కలసి వస్తుందని కొందరంటుంటే.. కోహ్లీ రాజీనామా చేసి జార్వోకు కెప్టెన్సీ ఇవ్వాలని మరొకొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోవడంతో సెమీస్‌ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఆదివారం(అక్టోబర్‌ 31) న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చదవండి: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్‌.. లంక స్పిన్నర్‌ ఖాతాలో పలు అరుదైన రికార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement