Ind Vs Nz T20 Series: Team India Players Practice Session Jaipur: ఆదివారం టి20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు రెండు రోజుల వ్యవధిలో మళ్లీ మైదానంలోకి దిగనుంది. భారత్‌తో జరిగే మూడు టి20 మ్యాచ్‌లు, రెండు టెస్టుల కోసం న్యూజిలాండ్ జట్టు సోమవారం సాయంత్రం దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో జైపూర్‌కు చేరుకుంది. దుబాయ్‌లో ‘బయో బబుల్’ నుంచి నేరుగా ఇక్కడకు చేరుకోవడంతో న్యూజిలాండ్ క్రికెటర్లకు క్వారంటైన్ విధించడంలేదు.
ప్రొటోకాల్ ప్రకారం కివీస్ ఆటగాళ్లందరికీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు... కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. భారత టి20 జట్టు సభ్యులు సోమవారం రాత్రి జైపూర్‌లో ముమ్మరంగా సాధన చేశారు.
కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు. మరోవైపు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు అజింక్య రహానే, పుజారా ముంబైలో ఏర్పాటు చేసిన నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. శుబ్‌మన్ గిల్, మయాంక్ కూడా నెట్స్‌లో శ్రమించారు. తొలి టెస్టు ఈ నెల 25 నుంచి కాన్పూర్‌లో, రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి ముంబైలో జరుగుతుంది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్:
►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్.
►రెండో టీ20- నవంబరు 19, రాంచి.
►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.
►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్.
►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.
చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్!
Warming up. #Jaipur #SMSstadium @BCCI pic.twitter.com/QnBYcvOWau
— Mandakini (@mandakini_) November 15, 2021
New roles 👌
— BCCI (@BCCI) November 16, 2021
New challenges 👊
New beginnings 👍
Energies were high yesterday on Day 1 at the office for #TeamIndia T20I captain @ImRo45 & Head Coach Rahul Dravid. 👏 👏#INDvNZ pic.twitter.com/a8zlwCREhl
Comments
Please login to add a commentAdd a comment