
ఎయిర్ హోస్టెస్‌ల సెల్‌ఫోన్లు మాయం
ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లకు చెందిన ఖరీదైన సెల్‌ఫోన్‌లు మాయమైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లకు చెందిన ఖరీదైన సెల్‌ఫోన్‌లు మాయమైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కొచ్చీకి చెందిన దీపికాదేష్ట, క్రిస్టిఎడుక్యులా జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌లు. విధుల్లో భాగంగా ఆదివారం నగరానికి వచ్చిన వీరు రాత్రి సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చారు.
భోజనం చేస్తున్న సమయంలో తమ ఖరీదైన ఐఫోన్, సామ్‌సంగ్ నోట్-4 సెల్‌ఫోన్లు పక్కనే పెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత చూడగా సెల్‌ఫోన్లు కనిపించలేదు. వెంటనే వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.