
ఎయిర్ హోస్టెస్ పోస్టు చేసిన అభ్యంతరకర చిత్రాలు
లండన్ : ‘‘ మీరు విమానంలో శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి. మీరు కోరుకున్న విధంగా గడపండి’’ అంటూ బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థ సోమవారం స్పందించి, విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి ఆచూకీ తెలియని సదరు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచరిస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం పోస్టులు, విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను ఉంచింది. తన లోదుస్తులను కూడా అమ్ముతానని ప్రచారం మొదలుపెట్టింది. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది)
లోదుస్తుల ధర దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని తెలిపింది. ఈ పోస్టులు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆదివారం చాలా వరకు పోస్టులను తొలిగించింది. అయితే సదరు ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భద్రంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టాము’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment