కూతురు కోసం 6 టికెట్లు కొన్నాడు..! | On Christmas Vacation Dad Bought 6 Flight Tickets To Be With His Air Hostess Daughter | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 5:20 PM | Last Updated on Fri, Dec 28 2018 5:25 PM

On Christmas Vacation Dad Bought 6 Flight Tickets To Be With His Air Hostess Daughter - Sakshi

కూతురు పియర్స్‌ వాఘన్‌తో తండ్రి హల్‌ వాఘన్‌

లోకంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ఎవరూ ప్రేమించలేరు. అనంతమైన వారి ప్రేమ మన జీవితాలకు ఎంతో అవసరం కూడా. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు.. తమ జీవితంలో వచ్చే అన్ని పండుగలు, సంతోషాలు, సంబరాలను వారితోనే కలిసి జరుపుకోవాలనుకుంటారు. కానీ నేటి కాలంలో ఉద్యోగాల వల్ల పిల్లలు ఒక చోట.. తల్లిదండ్రులు ఒక చోట ఉండాల్సిన పరిస్థితి. దాంతో సంవత్సరానికి ఒకటి, రెండు పండుగలను మాత్రమే అందరు కలిసి జరుపుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది హాల్‌ వాఘన్‌ అనే వ్యక్తికి. కూతురుతో కలిసి పండుగ జరుపుకోవడం కోసం ఆ తండ్రి చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వివరాలు..

పియర్స్‌ వాఘన్‌ అనే యువతి డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. క్రిస్టమస్‌ సీజన్‌ దృష్టా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమెకు పండుగ నాడే కాక మరుసటి రోజు కూడా సెలవు దొరకలేదు. దాంతో పండుగ రోజున కూతురుతో ఉండాలనుకున్న హాల్‌, కూతురు డ్యూటి నిమిత్తం వెళ్లే ప్రతి ప్రాంతానికి తాను వెళ్లాలని భావించాడు. అందుకోసం ఆరు టికెట్లను కొన్నాడు. దాంతో పండుగ రోజున తండ్రి, కూతుళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. మైక్‌ లేవి అనే ప్రయాణికుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చంది.

లేవి, హాల్‌తో పాటు అదే విమానంలో కలిసి ప్రయాణించాడు. మాటల సందర్భంలో లేవికి, హాల్‌ ప్రయాణం గురించి తెలిసింది. పియర్స్‌ పట్ల ఆమె తండ్రికున్న ప్రేమ చూసి ముగ్ధుడైన లేవి ఈ విషయం గురించి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. దాంతో ఈ తండ్రికూతుళ్ల అనురాగం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా పియర్స్‌ తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement