ఎయిర్‌హోస్టెస్‌పై దారుణం | air hostess molested, injured by biker in bangalore | Sakshi

ఎయిర్‌హోస్టెస్‌పై దారుణం

Feb 20 2017 2:42 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఎయిర్‌హోస్టెస్‌పై దారుణం - Sakshi

ఎయిర్‌హోస్టెస్‌పై దారుణం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఎయిర్‌హోస్టెస్ మీద గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఎయిర్‌హోస్టెస్ మీద గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈశాన్య బెంగళూరులో బాగా ధనవంతులు ఉండే ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి కూడా వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో బయటకు వచ్చింది. 
 
ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఓ ఎయిర్‌ హోస్టెస్ హెచ్‌ఆర్‌బీఆర్ లే అవుట్‌లోని తన ఇంటినుంచి స్నేహితురాలితో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా, బైకు మీద వచ్చిన ఓ వ్యక్తి వారికి సమీపంగా వచ్చాడు. అతడు మొఖం మొత్తం కవర్ అయ్యే హెల్మెట్ ధరించి, ఎయిర్‌హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమె ధరించిన టాప్ చింపేశాడు. ఆ దాడిలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలూ గట్టిగా అరవడంతో అతడు అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కేసులో నిందితులు ఎవరన్నది మాత్రం తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement