క్యూట్‌ లవ్‌ ప్రపోజల్‌.. వైరల్‌ వీడియో | Pilot Proposed To Air Hostess On Flight, she says ok | Sakshi
Sakshi News home page

క్యూట్‌ లవ్‌ ప్రపోజల్‌.. వైరల్‌ వీడియో

Published Thu, May 11 2017 5:31 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

క్యూట్‌ లవ్‌ ప్రపోజల్‌.. వైరల్‌ వీడియో

క్యూట్‌ లవ్‌ ప్రపోజల్‌.. వైరల్‌ వీడియో

ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరూ ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు పుట్టినరోజున, కొందరైతే తాము ఏదైనా సాధించిన రోజు ఇలా చెప్పుకుంటూ పొతే ఏన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ లవ్‌ ప్రపోజల్‌ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్‌ చేసిన లవ్‌ ప్రపోజల్‌ వైరల్‌ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎయిర్‌ హోస్టెస్‌ తమ పనుల్లో మునిగిఉండగా ఇంతలో పైలట్‌ అక్కడకు వచ్చాడు.

విమానంలో ఉండే ఫోన్‌ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్‌ హోస్టెస్‌ అతడివైపు కదిలింది. ఇంతలో అతడు మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె చేతిని పట్టుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. జీవితాంతం ఈ చేతిని వదలను అంటూ ఆమె కళ్లలోకి చూసి చెప్పాడు. మొదట ఆమె షాక్‌ తిన్నా.. వెంటనే పైలట్‌ ప్రపొజల్‌ కు ఒకే చెప్పింది. సినిమా సీన్‌ లా ప్రయాణికులు చూస్తుండగానే పైలట్‌, తన ప్రియురాలికి రింగ్‌ తొడిగి తన ప్రేమను గెలిపించుకున్నాడు. అందరూ చప్పట్లుకొడుతుండగా ఈ ప్రేమికులు ముద్దుల్లో మునిగితేలారు. ఆ వెంటనే విమానంలోని ఫోన్‌ తీసుకుని తన వేలికి ఉంగరాన్ని చూపిస్తూ ఎయిర్‌ హోస్టెస్‌ తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement