
సాక్షి, ముంబై: ఓ ఎయిర్ హోస్టెస్ తన అపార్ట్‌మెంట్‌లో కుళ్లిన స్థితిలో శవమై తేలిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా షైక్ అనే యువతి "గో ఎయిర్" విమానాశ్రయ సంస్థలో పని చేస్తోంది. ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమె ముంబైలోని పోద్దార్ వాడి ప్రాంతంలో నివసిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడానికి ముందే ఆ ఇద్దరు ముంబై విడిచి వెళ్లిపోయారు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని తన గదిలో ఒక్కతే నివసిస్తోంది. బుధవారం నాడు ఆమె ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆమె గదిలో ఎలాంటి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (దారుణం : హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ..)
Comments
Please login to add a commentAdd a comment