నాన్న ముద్ద | IndiGo Cabin Crew Member Readies For Work As Her Father Feeds Her; Video Viral - Sakshi
Sakshi News home page

నాన్న ముద్ద

Published Sun, Aug 27 2023 4:50 AM | Last Updated on Mon, Aug 28 2023 1:45 PM

IndiGo cabin crew member readies for work as her father feeds her - Sakshi

పిల్లలు స్కూలుకెళ్లే హడావుడిలో ఉంటే అమ్మలు అన్నం ముద్ద కలిపి పెడతారు. ఇక్కడ కూతురు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీకి వెళ్లే హడావుడిలో ఉంటే నాన్న బతిమాలి అన్నం తినిపిస్తున్నాడు. ఇండిగో ఎయిర్‌హోస్టెస్‌ పూజా బిహాని పెట్టిన ఈ ΄ోస్టు క్షణాల్లో వైరల్‌గా మారి అందరి చేతా తల్లినో, తండ్రినో గుర్తుకు తెప్పిస్తోంది.

‘తల్లి బిడ్డ కడుపు చూస్తుంది’ అంటారు. తండ్రికి మాత్రం బిడ్డ ఆకలి పట్టదా?
తల్లి కష్టపడ్డా, తండ్రి కష్టపడ్డా బిడ్డల కోసమే. జీవులకు లోకంలో అన్నింటి కంటే తృప్తినిచ్చేది తమ సంతానానికి ఆహారం అందించడమేనట. పిల్లలు తింటూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. వారు ఖాళీ కడుపులతో ఉంటే బాధ. ముద్దుకోసమో మురిపెం కోసమో పిల్లలకు ఎన్నేళ్లొచ్చినా గోరుముద్దలు తినిపించే తల్లులు ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి మార్కులు కొట్టేశాడు.

ఇండిగోలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న పూజా బిహాని డ్యూటీకి టైమయ్యి మేకప్‌ వేసుకుంటూ ఉంటే ఎక్కడ ఖాళీ కడుపుతో క్యాబ్‌ ఎక్కి తుర్రుమంటుందోనని ఆమె తండ్రి అన్నం తినిపించాడు. ఆ వీడియోను పూజా ఇన్‌స్టాలో ΄ోస్ట్‌ చేస్తే క్షణాల్లో 8.6 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’ అని ఒకరంటే ‘తల్లిదండ్రులు మాత్రమే పిల్లల బాగోగుల గురించి పట్టించుకుంటారు’ అని మరొకరు అన్నారు. ‘నాన్న గుర్తొస్తున్నారు’ అని ఒకరంటే ‘ఆ రోజులు మళ్లీ రావు’ అని మరొకరు బాధ పడ్డారు. చిన్న చిన్న ఆనందాల జీవితం అంటే ఇదేనని
అందరూ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement