Man In Metro Offers Seat to Girl Carrying a Baby Goes Viral Video: మెట్రోలో యువతికి సీటు ఆఫర్‌.. విషయం తెలిసి షాక్‌! - Sakshi
Sakshi News home page

వైరల్‌: మెట్రోలో యువతికి సీటు ఆఫర్‌.. విషయం తెలిసి షాక్‌!

Published Sat, Jul 24 2021 12:09 PM | Last Updated on Sat, Jul 24 2021 10:48 PM

Man In Metro Offers Seat to Girl Carrying a Baby Goes Viral Video - Sakshi

వెబ్‌డెస్క్‌: సోషల్‌ మీడియాలో కొన్ని విషయాలు చాలా సదరాగా ఉంటాయి. మరికొన్ని మనుషుల్లో భయాన్ని పుట్టిస్తాయి.  ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే వ్యక్తులు వృద్ధులకు, మానసిక వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలని ఒడిలో మోసుకెళ్ళే మహిళల కోసం తమ సీట్లను ఆఫర్‌ చేస్తుంటారు. తాజాగా ఓ మెట్రో రైలులో తన ముందు నిల్చున్న అమ్మాయికి ఓ యువకుడు తన సీటు ఇచ్చాడు. దీంతో ఆమె ఏమీ మాట్లాడకుండా సంతోషంగా ఆఫర్‌ను అంగీరించి సీటులో కూర్చుంది. అయితే నల్ల దుప్పటి కప్పి ఓ చిన్నపిల్లాడిని ఆమె చేతుల్లో ఎత్తుకున్నట్లు కనిపించడంతో ఆ యువతికి ఈ ఆఫర్‌ ఇచ్చాడు.    

తర్వాత ఆమె చేతిలో పట్టుకున్న దుప్పటిని తీయడంతో.. టెడ్డీ బేర్‌ పట్టుకున్నట్లు తెలిసి షాక్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.  దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ ఏమైనప్పటికీ నీ  దయార్థ హృదయం నాకు నచ్చింది. నీకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని కామెంట్‌ చేశాడు. ఇక మరో నెటిజన్‌ ‘‘ సీటు కోసమే అలా చేసిందా..యాధృచ్ఛికంగా జరిగిందా..?’’ అంటూ ప్రశ్నించాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement