carrying woman
-
వైరల్: మెట్రోలో యువతికి సీటు ఆఫర్.. విషయం తెలిసి షాక్!
వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చాలా సదరాగా ఉంటాయి. మరికొన్ని మనుషుల్లో భయాన్ని పుట్టిస్తాయి. ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే వ్యక్తులు వృద్ధులకు, మానసిక వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలని ఒడిలో మోసుకెళ్ళే మహిళల కోసం తమ సీట్లను ఆఫర్ చేస్తుంటారు. తాజాగా ఓ మెట్రో రైలులో తన ముందు నిల్చున్న అమ్మాయికి ఓ యువకుడు తన సీటు ఇచ్చాడు. దీంతో ఆమె ఏమీ మాట్లాడకుండా సంతోషంగా ఆఫర్‌ను అంగీరించి సీటులో కూర్చుంది. అయితే నల్ల దుప్పటి కప్పి ఓ చిన్నపిల్లాడిని ఆమె చేతుల్లో ఎత్తుకున్నట్లు కనిపించడంతో ఆ యువతికి ఈ ఆఫర్ ఇచ్చాడు. తర్వాత ఆమె చేతిలో పట్టుకున్న దుప్పటిని తీయడంతో.. టెడ్డీ బేర్ పట్టుకున్నట్లు తెలిసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఏమైనప్పటికీ నీ దయార్థ హృదయం నాకు నచ్చింది. నీకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ‘‘ సీటు కోసమే అలా చేసిందా..యాధృచ్ఛికంగా జరిగిందా..?’’ అంటూ ప్రశ్నించాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ✌️URBAN._JATTS✌️ (@urban._jatts) -
ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..
సాక్షి, భువనేశ్వర్: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణిని స్థానికులు మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆపై ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాసీపూర్ సమితి కీరాఅంబొ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కీరాఅంబొ గ్రామానికి చెందిన కొసేయి మజ్జి భార్య బాసంతికి పురిటి నొప్పులు రావడంతో.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, సరైన రహదారి లేకపోవడంతో ఆంబులెన్స్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. దీంతో గర్భిణిని గ్రామస్తులు మోసుకుంటూ ఆంబులెన్స్ వద్దకు చేర్చారు. టకిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, బాసంతి ఆడశిశువుకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామీణ రహదారులను మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: డెల్టా ప్లస్ డేంజర్ కాదు -
వారిలో మానవత్వం మచ్చుకైనా లేదా...?
బిచ్కుంద (నిజామాబాద్): పురుటి నొప్పులతో అవస్థ పడుతూ ఎలాగోలా అస్పత్రికి చేరుకున్న ఓ గర్భిణి పట్ల అక్కడి వైద్య సిబ్బంది కనీస మానవత్వం కూడా లేకుండా వ్యవహరించారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఆమెను బయటకు గెంటేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ మహిళ ఆస్పత్రి బయటే మగబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద ఆస్పత్రి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథ్ పల్లి తండాకు చెందిన దశ్వతి బాయి పురుటి నొప్పులు తీవ్రం కావడంతో ఉదయం 9 గంటలకు ప్రసవం కోసం 108 వాహనంలో ఆస్పత్రికి వచ్చింది. అప్పటి వరకూ తీసుకున్న వైద్యానికి సంబంధించి పత్రాలు చూపించాలని సిబ్బంది అడిగారు. తీసుకురాలేదని, నొప్పులు తీవ్రంగా ఉన్నాయని ఆమె వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు. డాక్టర్ అందుబాటులో లేరంటూ బాన్సువాడ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పురుటి నొప్పులతో ఆ మహిళ రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలో నరకం అనుభవించింది. చివరకు ఓ బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత అయినా వైద్య సిబ్బందిలో చలనం లేదు. శిశువు జన్మించి గంట దాటినా సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించ లేదు. ఇక చేసేది లేక తల్లి, బిడ్డను కుటుంబ సభ్యులు దెగ్లూర్ ఆస్పతికి తీసుకెళ్లారు. అయితే, డాక్టర్ జ్యోతి సుభా ఇంటి వద్ద ఉన్నప్పటికీ ఆస్పత్రికి వచ్చి వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.