దాన్ని తెచ్చిస్తే 5 వేల డాల‌ర్లు: హీరో | Viral: Ryan Reynolds Offers Cash Reward For Returning Woman Teddy | Sakshi
Sakshi News home page

ఆ బొమ్మ ఇచ్చిన‌వారికి న‌జ‌రానా ప్ర‌క‌టించిన హీరో

Published Mon, Jul 27 2020 6:52 PM | Last Updated on Mon, Jul 27 2020 6:58 PM

Viral: Ryan Reynolds Offers Cash Reward For Returning Woman Teddy - Sakshi

వాషింగ్టన్: కెన‌డాకు చెందిన‌ మారా సోరియాన్ అనే మ‌హిళ జూలై 24న ఇల్లు మారే క్ర‌మంలో త‌న టెడ్డీబేర్ క‌నిపించ‌ట్లేద‌ని గ‌మ‌నించింది. మొత్తం అన్నీ వెతుకుతుండ‌గా త‌న ఐపాడ్ కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎవ‌రో దొంగ‌త‌నం చేశార‌ని అర్థ‌మైంది. అది మామూలు బొమ్మ అయితే ప‌ట్టించుకునేది కాదేమో కానీ, ఆ బొమ్మ‌లో నుంచి "ఐ ల‌వ్ యూ", "నిన్ను చూసి గ‌ర్విస్తున్నాను", "నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను" అన్న మాట‌లు వినిపిస్తాయి. ఇవి గతేడాది చ‌నిపోయిన ఆమె త‌ల్లి చివ‌రి మాట‌లు.. దీంతో ఆమె త‌న టెడ్డీబేర్ తిరిగిచ్చేయండంటూ సోష‌ల్ మీడియాలో వేడుకుంది. (ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’)

ఈ పోస్ట్ డెడ్‌పూల్ స్టార్ హీరో ర్యాన్ రెనాల్డ్స్ కంట‌ప‌డింది. వెంట‌నే ఆయ‌న ఆ బొమ్మ‌ను ఆమె ద‌గ్గ‌రికి చేర్చిన‌వారికి 5 వేల డాల‌ర్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆమెకు తిరిగి బొమ్మ దొరికేంత‌వ‌ర‌కు మ‌నమంద‌రు సాయం చేయాలని చెప్పుకొచ్చారు. మ‌హిళ‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆమె పోగొట్టుకున్న‌ బొమ్మ కోసం న‌జ‌రానా ప్ర‌క‌టించ‌డంపై ర్యాన్ అభిమానులు హీరోను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. "ఇందుకే మేము మీకు అభిమానుల‌మ‌య్యాము" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఆ బొమ్మ‌కు ఏమీ కావ‌ద్ద‌ని, అది తిరిగి స‌ద‌రు మ‌హిళ చెంత‌కు చేరాల‌ని ప్రార్థిస్తున్నారు. (అత్యాచారం కేసులో న‌టుడి అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement