
బనశంకరి: తనను విహారయాత్రకని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ యువతి తన ప్రియుడిపై ఆదివారం హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు..‘నాకు..నగరంలోని ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేసే దినేశ్‌తో పరిచయమై తర్వాత ప్రేమగా మారింది. త్వరలో వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మురుడేశ్వర విహారయాత్రకు తీసుకెళ్లి కొబ్బరి బొండంలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకుంటానని పేర్కొనడంతో మిన్నకుండిపోయా. ఇటీవల మడికేరికి తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడి ఆదృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. విషయం బయటిపెడితే అశ్లీల వీడియోను సామాజిక వెబ్‌సైట్లలో ఆప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు’ అని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment