టర్కీ పర్యటనలో సీఎం చంద్రబాబు | chandra babu Vacation with the family in Turkey tour | Sakshi
Sakshi News home page

టర్కీ పర్యటనలో సీఎం చంద్రబాబు

Published Wed, Aug 5 2015 1:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

టర్కీ పర్యటనలో సీఎం చంద్రబాబు - Sakshi

టర్కీ పర్యటనలో సీఎం చంద్రబాబు

కుటుంబసభ్యులతో కలసి విహారయాత్ర.. 7వ తేదీన తిరిగిరాక

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలసి టర్కీ దేశంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ఆగస్టు 1వ తేదీ రాత్రి తన  సతీమణితో కలసి టర్కీ పర్యటనకు వెళ్లారు. లోకేష్ అంతకంటే ఒకరోజు ముందు తన కుటుంబంతో టర్కీ వెళ్లారు. వారంతా టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌తో పాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

ఈ పర్యటనలో వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఈ నెల ఏడో తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. టర్కీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. మీడియాకు కూడా వివరాలు చెప్పలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement