థాయిలాండ్‌లో నగర జంట మృతి
విహార యాత్రలో స్పీడ్‌బోట్ పల్టీ కొట్టడంతో దుర్ఘటన
మృతులు సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఈడీ యుష్ దంపతులు
హైదరాబాద్: థాయిలాండ్‌కు విహార యాత్రకు వెళ్లిన ఓ జంట పడవ ప్రమాదానికి గురై మృతి చెందింది. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12కు చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సూర్యలత స్పిన్నింగ్ మిల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ యష్ అగర్వాల్ (27) ఆయన భార్య పంకూరి మిట్టల్ (25) ఈ నెల రెండున థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లారు. సోమవారం సాయంత్రం బీచ్‌కు వెళ్లి అక్కడ స్పీడ్ బోట్ ఎక్కారు. ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలల తాకిడికి బోటు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువ జంట గల్లంతైంది. బోటు నడుపుతున్న వ్యక్తికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
ఆయన ఇచ్చిన సమాచారంతో నౌకాదళ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి రెండు మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. వీరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్‌లో విషాదం అలుముకుంది. నగరంలో బడా పారిశ్రామిక వేత్తలో ఒకరైన మహేందర్‌కుమార్ అగర్వాల్ తనయుడైన యష్‌అగర్వాల్ గత ఏడాది నవంబర్‌లో ఛండీగఢ్‌కు చెందిన పంకూరి మిట్టల్‌ను వివాహం చేసుకున్నారు. కాగా సొంత విమానాలు కలిగి ఉన్న మృతురాలి తండ్రి.. కూతురు, అల్లుడి మృతదేహాలను థాయిలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువస్తున్నారు.