Yash Agarwal
-
థాయిలాండ్‌లో నగర జంట మృతి
విహార యాత్రలో స్పీడ్‌బోట్ పల్టీ కొట్టడంతో దుర్ఘటన మృతులు సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఈడీ యుష్ దంపతులు హైదరాబాద్: థాయిలాండ్‌కు విహార యాత్రకు వెళ్లిన ఓ జంట పడవ ప్రమాదానికి గురై మృతి చెందింది. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12కు చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సూర్యలత స్పిన్నింగ్ మిల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ యష్ అగర్వాల్ (27) ఆయన భార్య పంకూరి మిట్టల్ (25) ఈ నెల రెండున థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లారు. సోమవారం సాయంత్రం బీచ్‌కు వెళ్లి అక్కడ స్పీడ్ బోట్ ఎక్కారు. ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలల తాకిడికి బోటు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువ జంట గల్లంతైంది. బోటు నడుపుతున్న వ్యక్తికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో నౌకాదళ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి రెండు మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. వీరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్‌లో విషాదం అలుముకుంది. నగరంలో బడా పారిశ్రామిక వేత్తలో ఒకరైన మహేందర్‌కుమార్ అగర్వాల్ తనయుడైన యష్అగర్వాల్ గత ఏడాది నవంబర్‌లో ఛండీగఢ్‌కు చెందిన పంకూరి మిట్టల్‌ను వివాహం చేసుకున్నారు. కాగా సొంత విమానాలు కలిగి ఉన్న మృతురాలి తండ్రి.. కూతురు, అల్లుడి మృతదేహాలను థాయిలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువస్తున్నారు. -
మృత్యుహేల
థాయిలాండ్ పడవ ప్రమాదంలో దంపతుల విషాదాంతం గోవా బీచ్‌లో నగర డిజైనర్ మృతి కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త తండ్రి చేతిలో హతమైన పిల్లలకు అంత్యక్రియలు వరుస సంఘటనలతో తల్లడిల్లిన నగరం గోవా, థాయిలాండ్‌లలో సంభవించిన వేర్వేరు ప్రమాదాలలో నగరానికి చెందిన ముగ్గురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో విషాదఛాయలు అలముకున్నాయి. స్విమ్మింగ్‌లో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న జూబ్లీహిల్స్‌కు చెందిన ఇంటీరియర్డిజైనర్ అపర్ణాకార్వీ (44) గోవా బీచ్‌లో ఈత కొడుతూ దురదృష్టవశాత్తూ మృత్యువాత పడ్డారు. థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లిన బంజారాహిల్స్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త యష్ అగర్వాల్ (27), ఆయన భార్య పంకూరి మిట్టల్ (25)లు అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించారు. వారి ముగ్గురి మరణ వార్తలు వినగానే బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా, సట్టా ఆడొద్దని అడ్డుకున్న పాపానికి తిరుమల గిరిలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మరోవైపు తండ్రి ప్రొఫెసర్ గురుప్రసాద్ చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నందవిహారి (5) అంత్యక్రియల సందర్భంగా మల్కాజ్‌గిరిలో విషాదఛాయలు అలముకున్నాయి. దసరా, బక్రీద్ పండుగల ఆనందంలో ఉన్న నగర వాసులు ఈ సంఘటనలతో విషాదంలో కూరుకుపోయారు. -
రెండో రౌండ్లో యశ్ అగర్వాల్
జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో యశ్ అగర్వాల్ రెండో రౌండ్లోకి చేరుకున్నాడు. తారీఖ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో యశ్ అగర్వాల్ 6-0తో సుజిత్ చంద్రారెడ్డిపై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో అఖిల్ కుమార్ రెడ్డి 6-0తో వేదాంత్‌పై నెగ్గగా, సలీల్ దాండ్రియాల్ 6-0తో శరద్ చంద్రపై గెలిచాడు. మోనిష్ 6-1తో సామ్యూల్ జోష్య విశ్వాస్‌పై, జియా హంజా పాషా 6-1తో పద్మేష్ పట్వారిపై గెలిచారు. సాయి పృథ్విక్ 6-2తో శశాంక్‌ను, సుహిత్ రెడ్డి 6-5తో అభినవ్‌ను, శశిప్రీతమ్ 6-2తో అనురాగ్‌ను ఓడించారు. చనుష్ బాబు 6-1తో స్పర్శ్ మిట్టల్‌పై, హర్షవర్ధన్ 6-2తో నిశ్చయ్‌పై, తనిష్క్ 6-2తో సాయిశేఖర్పై గెలిచారు. ఇతర ఫలితాలు: అండర్-12 బాలుర రెండో రౌండ్: కుషాల్ 6-1తో అక్షద్పై, సేవంత్ 6-4తో తరుణ్‌పై, ఆర్యన్ 6-4తో మిహిర్‌పై, శ్రీకార్తీక్ 6-3తో ప్రణీత్‌పై, ఆకాశ్ 6-3తో విదుర్‌పై, యశ్ అగర్వాల్ 6-2తో రహిత్ బాబుపై, మనార్ 6-1తో అరుణ్‌పై, సాయి కార్తీక్ 6-2తో విశ్వక్పై, అక్షిత్ 6-0తో రాజేశ్వర్ రెడ్డిపై, ముకుంద్ రెడ్డి 6-4తో అర్చిత్‌పై, ఆయుష్ పవన్ 6-0తో హర్షవర్ధన్‌పై, శశిధర్ 6-0తో ధీరజ్ కమార్‌పై, యశ్వంత్ 6-3తో పులకిత్‌పై, రుషికేశ్ 6-1తో జైకృష్ణపై గెలుపొందారు. అండర్-10 బాలికల తొలి రౌండ్: తనుషిత రెడ్డి 6-3తో దియా రెడ్డిని, చాహన 6-4తో భువి శేఖర్ని, అదితి 6-1తో ప్రాంజలని, అభయ 6-0తో శ్రీవిధిని ఓడించారు.