రెండో రౌండ్‌లో యశ్ అగర్వాల్ | Yash Agarwal in the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో యశ్ అగర్వాల్

Published Mon, Feb 3 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

Yash Agarwal in the second round

జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో యశ్ అగర్వాల్ రెండో రౌండ్‌లోకి చేరుకున్నాడు. తారీఖ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మొదటి రౌండ్‌లో యశ్ అగర్వాల్ 6-0తో సుజిత్ చంద్రారెడ్డిపై గెలుపొందాడు.
 
 
 మరో మ్యాచ్‌లో అఖిల్ కుమార్ రెడ్డి 6-0తో వేదాంత్‌పై నెగ్గగా, సలీల్ దాండ్రియాల్ 6-0తో శరద్ చంద్రపై గెలిచాడు. మోనిష్ 6-1తో సామ్యూల్ జోష్య విశ్వాస్‌పై, జియా హంజా పాషా 6-1తో పద్మేష్ పట్వారిపై గెలిచారు. సాయి పృథ్విక్ 6-2తో శశాంక్‌ను, సుహిత్ రెడ్డి 6-5తో అభినవ్‌ను, శశిప్రీతమ్ 6-2తో అనురాగ్‌ను ఓడించారు. చనుష్ బాబు 6-1తో స్పర్శ్ మిట్టల్‌పై, హర్షవర్ధన్ 6-2తో నిశ్చయ్‌పై, తనిష్క్ 6-2తో సాయిశేఖర్‌పై గెలిచారు.
 
 ఇతర ఫలితాలు:  అండర్-12 బాలుర రెండో రౌండ్: కుషాల్ 6-1తో అక్షద్‌పై, సేవంత్ 6-4తో తరుణ్‌పై, ఆర్యన్ 6-4తో మిహిర్‌పై, శ్రీకార్తీక్ 6-3తో ప్రణీత్‌పై, ఆకాశ్ 6-3తో విదుర్‌పై, యశ్ అగర్వాల్ 6-2తో రహిత్ బాబుపై, మనార్ 6-1తో అరుణ్‌పై, సాయి కార్తీక్ 6-2తో విశ్వక్‌పై, అక్షిత్ 6-0తో రాజేశ్వర్ రెడ్డిపై, ముకుంద్ రెడ్డి 6-4తో అర్చిత్‌పై, ఆయుష్ పవన్ 6-0తో హర్షవర్ధన్‌పై, శశిధర్ 6-0తో ధీరజ్ కమార్‌పై, యశ్వంత్ 6-3తో పులకిత్‌పై, రుషికేశ్ 6-1తో జైకృష్ణపై గెలుపొందారు.  అండర్-10 బాలికల తొలి రౌండ్: తనుషిత రెడ్డి 6-3తో దియా రెడ్డిని, చాహన 6-4తో భువి శేఖర్‌ని, అదితి 6-1తో ప్రాంజలని, అభయ 6-0తో శ్రీవిధిని ఓడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement