ఓల్డ్ ఏజ్‌లోనూ... గోల్డెన్ ట్రిప్స్
విహారం
ఆరుపదుల వయసు దాటిన వారు విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే సరైన రక్షణ చర్యలు తీసుకొని ప్రయాణిస్తే ఆందోళనకు ఆమడ దూరం ఉండవచ్చు. ప్రయాణాన్ని ఆనందంగా మలచుకోవచ్చు.వయసు పైబడినవారు వెళ్లదలచుకున్న ప్రాంతాన్ని బట్టి ట్రావెల్ ఏజెంట్స్‌ను సంప్రదిస్తే ప్రత్యేక ప్యాకేజీల సమాచారం లభిస్తుంది. ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.వృద్ధులు ఒక గ్రూప్‌గా కలిసి, విహారానికి వెళితే ఒంటరితనం దరిచేరదు. ఖర్చు పెరగదు. ఆనందాన్ని రెట్టింపుచేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని బట్టి ముందుగా టూర్ ఆపరేటర్‌ని సంప్రదిస్తే వీల్‌చైర్ వంటి మెరుగైన సేవలనూ పొందే అవకాశం ఉంటుంది.విహారయాత్రలో ఆరోగ్యపరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పలేం కాబట్టి, ప్రయాణ బీమా తీసుకోవడం మేలు.{పయాణానికి ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. అలాగే, వైద్యులు సూచించిన మందులు, వేళ ప్రకారం వాడవల్సిన మందుల జాబితా వెంట తీసుకెళ్లడం మంచిది.