Protection measures
-
రక్షణ, పర్యవేక్షణ లేకే ప్రమాదం
మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : శాంతిఖని గని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడమే కాకుండా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగింద నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రస్తుతం గనిలో పనిచేస్తున్న ఓవర్‌మెన్, సర్దార్, అండర్ మేనేజర్, సంబంధిత అధికారులు, సూపర్వైజర్లలో చాలా మంది జూనియర్లే కావడంతో ప్రమాదాన్ని పసిగట్ట లేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంక్షన్లో రక్షణ ప్రమాదం జరిగిన 52 లెవల్, ఒకటో డీప్ జంక్షన్లో క్రాస్బార్లో కనీసం మూడు దిమ్మలైనా బండ, సిమెంటుతో కట్టాలి. సరైన కొలతలతో ైసైడుల్లో రంధ్రాలు చేసి 5ఁ10 లేదా 6ఁ12 ఇంచుల సైజు గలిగిన గడ్డర్లు ఎక్కించి వాటిపై లైటుబార్లు లేదా 4ఁ8 బార్లు పెట్టి వాటిపై దిమ్మెలు కట్టి లాగింగ్ చేయాలి. సైడ్‌వాల్‌లు బలహీనంగా ఉంటే సైడుల లో మేసనరీ లై నింగ్ లేద పిన్నులు బిగించి వాటిపై బార్లు లేద గర్డర్లు పెట్టి సపోర్లు చేయాలి. నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు కట్టి వాటిపై గర్డర్లతో సపోర్డు ఏర్పాటు చేస్తే పైకప్పు కూలకుండా ఉం టుంది. దిమ్మెల నిర్మాణం సుమారు 30 టన్నుల బరువును ఆపుతుంది. పది చదరపు మీటర్ల ఏరియా ను సపోర్టు చే స్తుంది. ర క్షణ చర్యలు చేపట్టినప్పటికీ నిత్యం సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉం టుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన జంక్షన్లో ఏ ఒక్క ర క్షణ నిర్మాణం చేపట్టకపోవడం వల్లే కార్మికు లు ప్రాణాలను కోల్పోయారని తెలుస్తోంది. ప్రాణం పోసిన హెచ్చరిక ప్రమాదం జరిగిన బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఐదు నిమిషాల ముందు రక్షణ అధికారి హెచ్చరిక తోటి కార్మికులకు ప్రాణం పోసింది. జంక్షన్ వద్దకు సుమారు 25 మంది కార్మికులు నీరు తాగడానికి వచ్చారు. ఆ స్థలంలో చల్లని గాలి వస్తుండడంతో కొద్దిసేపు సేదతీరుతామని అనుకున్నారు. ఇంతలోనే గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటు వైపుగా వచ్చి ‘ఇక్కడ ఏం చేస్తున్నారు.. పనికి వెల్లండి’.. అంటూ హెచ్చరించారు. దీంతో కార్మికులు పనులకు వెళ్లిపోయూరు. తర్వాత కొద్ది నిమిషాల్లోనే అక్కడ పైకప్పు(బండ) కూలింది. వచ్చిన అధికారి కార్మికులతో మాట్లాడుకుంటూ నిలబడినా 26 మంది ప్రాణాలు పోయేవి. ఒక వేళ ఆ అధికారి రాకపోరుునా 25 మంది ప్రాణాలు బండ కింద నలిగిపోయేవి. -
రూ.కోట్ల విలువైన భూములకు రక్షణ కరువు
* కలెక్టర్ చొరవ తీసుకోవాలి * కంచె ఏర్పాటు చేయాలని ప్రజల వినతి యాచారం: కోట్లాది రూపాయల విలువైన భూములకు రక్షణ లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. భూములు మళ్లీ అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరానికి చేరువలోని నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై సమీపంలోని యాచారం మండలంలోని పలు గ్రామాల్లో భూములు ధరలు రూ. లక్షల్లో పలుకుతున్నాయి. వీటిని పరిరక్షించే విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కాగా.. ఇటీవల రెవెన్యూ అధికారులు యాచారం, మాల్, గాడ్లగూడెం, గునుగల్, తాడిపర్తి తదితర గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి పీఓటీ యాక్టు కింద స్వాధీనపర్చుకున్నారు. కానీ ఇవి కబ్జాకు గురి కాకుండా చుట్టూ కంచె నిర్మించడంలో మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూముల విలువ రూ.10 కోట్లపైనే.. తహసీల్దార్ వసంతకుమారి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక చొరవ కనబర్చారు. రూ. 10 కోట్లకు పైగా విలువ జేసే భూములను కాపాడారు. యాచారం రెవెన్యూ పరిధిలోని 242, 191, 225 సర్వే నంబర్లల్లోని రూ. 2 కోట్ల విలువైన 5 ఎకరాలు, గాడ్లగూడెంలోని సర్వే నంబర్ 300లో 2 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిలో గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకోగా 120 గజాల లోపు ఉన్న 20 మంది పేదలకు క్రమబద్ధీకరణలో సర్టిఫికెట్లు ఇప్పించారు. మిగితా రూ. 40 లక్షల విలువైన భూమిని గుర్తించి, ఆక్రమణదారులకు హెచ్చరికలు చేశారు. తాడిపర్తి గ్రామంలోని 155 సర్వే నంబరులోని దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎకరాకు రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షల చొప్పున డిమాండ్ ఉంది. గునుగల్ రెవెన్యూ పరిధిలో రూ. 60 లక్షలకుపైగా విలువైన ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి- మహబూబ్‌నగర్- నల్గొండ జిల్లాల సరిహద్దులోని యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి ధర పలుకుతోంది. ఈ భూమికి హద్దులు గుర్తించకపోవడంతో రియల్ వ్యాపారులు కబ్జాలు చేసి రూ.లక్షల్లో ప్లాట్లను అమ్ముకుంటున్నారు. కంచెల ఏర్పాటుకు డబ్బులు లేవట.. రూ. కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు వాటి పరిరక్షణకు రూ.వేలల్లో ఖర్చయ్యే కంచెల ఏర్పాటుతో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల యాచారంలో పర్యటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇక్కడి పలు సర్వేనంబర్లలో స్వాధీనం చేసుకున్న భూముల రక్షణ నిమిత్తం కంచె ఏర్పాటుకు రూ.2 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూముల రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్‌కు నివేదిక పంపాం ఆయా గ్రామాల్లో గుర్తించిన భూముల రక్షణ నిమిత్తం నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదిక అందజేశాం. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిధులు మంజూరు కాగానే కంచెలు ఏర్పాటు చేస్తాం. - వసంతకుమారి, తహసీల్దార్, యాచారం -
ఓల్డ్ ఏజ్‌లోనూ... గోల్డెన్ ట్రిప్స్
విహారం ఆరుపదుల వయసు దాటిన వారు విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే సరైన రక్షణ చర్యలు తీసుకొని ప్రయాణిస్తే ఆందోళనకు ఆమడ దూరం ఉండవచ్చు. ప్రయాణాన్ని ఆనందంగా మలచుకోవచ్చు.వయసు పైబడినవారు వెళ్లదలచుకున్న ప్రాంతాన్ని బట్టి ట్రావెల్ ఏజెంట్స్‌ను సంప్రదిస్తే ప్రత్యేక ప్యాకేజీల సమాచారం లభిస్తుంది. ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.వృద్ధులు ఒక గ్రూప్‌గా కలిసి, విహారానికి వెళితే ఒంటరితనం దరిచేరదు. ఖర్చు పెరగదు. ఆనందాన్ని రెట్టింపుచేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని బట్టి ముందుగా టూర్ ఆపరేటర్ని సంప్రదిస్తే వీల్‌చైర్ వంటి మెరుగైన సేవలనూ పొందే అవకాశం ఉంటుంది.విహారయాత్రలో ఆరోగ్యపరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పలేం కాబట్టి, ప్రయాణ బీమా తీసుకోవడం మేలు.{పయాణానికి ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. అలాగే, వైద్యులు సూచించిన మందులు, వేళ ప్రకారం వాడవల్సిన మందుల జాబితా వెంట తీసుకెళ్లడం మంచిది. -
మందు పిచికారీ చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల్లో చీడపీడల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు రైతులు మందులు పిచికారీ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో మందులు పిచికారీ చేస్తూ స్వీయ రక్షణకు విస్మరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన యువ రైతు లస్మన్న రక్షణ చర్యలు లేకుండా మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శనివారం నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) ఝాడే రాజ్‌కుమార్(25) పత్తి పంటకు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ క్రమంలో మందు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. సూచనల మేరకే పిచికారీ చేయాలి.. పైరును ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన విధంగా పిచికారీ చేస్తే ఉపయోగం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. సూచనల మేరకు పిచికారీ చేయాలి. ఒక పంటకు పిచికారీ చేసిన మందు డబ్బాను మరో పంటకు ఇతర(కలుపు) మందును కలిపి పిచికారీ చేస్తే పంటలో ఏదైనా మార్పు, ఆకులు ముడుచుకుపోవడం కనిపిస్తే వెంటనే 20గ్రాముల యూరియా, 20గ్రాముల చక్కెర కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. మందులు అధికంగా వాడడం మూలంగా పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర మిత్ర పురుగులు మృత్యువాత పడుతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. అవసరమైనవే.. పంటలకు పురుగు మందులు వాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన స్ప్రేలను జాగ్రత్తగా వాడాలి. పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. అవగాహన అవసరం పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడిన ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని గ్రహించాలి. మందు ప్రభావానికి గురైతే.. పురుగుల మందు ప్రభావానికి గురైన వ్యక్తికి ముందు నోటిలోకి వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్ఛపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డను ఉంచాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకవెళ్లాలి, అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్‌కు తెలపాలి. -
నరకానికి నో గేట్
►ప్రాణాలు తీస్తున్న కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ►ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడంలో రైల్వే శాఖ విఫలం ►మెదక్ రైల్వే దుర్ఘటనతోనైనా గుణపాఠం నే ర్చేనా? సంగడిగుంట (గుంటూరు): కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ప్రాణాంతకంగా మారాయి. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ మొత్తం 135 ఉన్నాయి. కాపలా దారుడు లేకపోవడంతో ఆ దారిలో వెళ్లే పలు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదం జరిగిన అనంతరం ఆ లెవెల్ క్రాసింగ్ వద్ద యుద్ధ ప్రాతిపదికన గేటు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడంలో రైల్వే శాఖ విఫలమవుతున్నట్టు తేటతెల్లమవుతోంది. మెదక్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర రైలు ప్రమాదంతో గుంటూరు జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికైనా కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌లపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు. ► దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ జూన్ 2న చేసిన ప్రకటన ప్రకారం జోన్ పరిధిలో 1,431 లెవెల్ క్రాసింగ్స్ ఉండగా వాటిలో 655 కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి. ► వీటిని 2015-16 నాటికి పూర్తిగా కాపలా ఉండే లెవెల్ క్రాసింగ్స్గా, రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రహదారి మళ్లింపు, కాపలాదారుతో గేటుల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రకటించారు. ► గుంటూరు రైల్వే డివిజన్లో మాత్రం 135 కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి. ► గత ఐదేళ్లలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్(యూఎల్సీ) వద్ద 7 ప్రమాదాలు జరిగాయి. పలువురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గుంటూరుకు అతి సమీపంలో బండారుపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన తరువాత రైల్వే గేటును ఏర్పాటు చేశారు. ►ఇప్పటికీ జిల్లాలోని ఫిరంగిపురం లెవెల్ క్రాసింగ్ 209, నంబూరు లెవెల్ క్రాసింగ్ 8 తదితర ప్రాంతాల్లో కాపలాదారుడు లేడు.పొందుగల వద్ద గేటు ఏర్పాటు జరుగుతుంది. ► డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన చోటే రక్షణ చర్యలు చేపట్టి కాపలాదారుని ఏర్పాటు, గేటు ఏర్పాటు చేశారు తప్ప ముందుగా రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించడం, రహదారి మళ్లింపు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు తదితర రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్చరిక బోర్డులను పట్టించుకోవడం లేదు.. ►డివిజన్ పరిధిలో కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ 135 ఉన్నాయి. వీటిలో 27 లెవెల్ క్రాసింగ్స్ ఈ ఏడాదిలోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పని జరుగుతోంది. నిధుల కేటాయింపును బట్టి ప్రాధాన్యత నిస్తూ 2015-17 ఏడాదిలోపు అన్నింటినీ తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాపలాలేని క్రాసింగ్స్ వద్ద ప్రమాదాలు జరగటానికి కారణం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద నివారణ సూచనలు పాటించకపోవడమే. ప్రమాద హెచ్చరిక సూచికలను పట్టించుకోకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. - ఎం.హెచ్.సత్యనారాయణ, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ -
తరిగిపోతున్న పచ్చధనం
- యథేచ్ఛగా వృక్షాల నరికివేత - ఆక్రమణల పాలవుతున్న అడవులు - చోద్యం చూస్తున్న అటవీ శాఖాధికారులు అనంతపురం : పచ్చదనం తరిగిపోతోంది. అటవీ ప్రాంత అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలతో ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్న అధికారులు వాటి పర్యవేక్షణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోంది. స్వార్థపరులు విచక్షణా రహితంగా వృక్షాలు నరికి వేయడం, అటవీ భూముల దురాక్రమణ కారణంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 1,98,930 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీని పరిరక్షణకు అటవీ శాఖతో పాటు 284 వన సంరక్షణ సమితుల్లోని 75,300 మంది సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ అడవుల్లో రూ.12 కోట్ల వ్యయంతో 2011-12లో 300 హెక్టార్లలో 1.20 లక్షల నారేపి, తపసి మొక్కలు, 2012-2013లో 300 హెక్టార్లలో 1.20 లక్షల అటవీ జాతుల మొక్కలతోపాటు, 12లక్షల యూకలిప్టస్, 2013-14లో 900 హెక్టార్లలో వివిధ రకాల మొక్కలను అటవీ శాఖ నాటింది. సాధారణంగా అటవీ జాతుల మొక్కలు మూడేళ్లలో 8 నుంచి 10 అడుగులు, యూకలిప్టస్ మొక్కలు 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికి మూడేళ్లు దాటుతున్నా అడవుల్లో ఆ మేరకు పెరిగిన చెట్లు కనిపించడం లేదు. పైగా అధికారులు నాటిన మొక్కల సంఖ్యకన్నా, నరికివేతకు గురైన వృక్షాల సంఖ్యే అధికంగా ఉంటోందన్న వాదన వినిపిస్తోంది. జనారణ్యంలోకి వన్యప్రాణులు అడవుల్లోని వృక్షాలు విచ్చలవిడిగా నరికివేతకు గురికావడంతో ఒకప్పుడు పచ్చని అడవులుగా ఉన్నప్రాంతాలు ప్రస్తుతం బోడికొండలు, గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ఆవాసంగా కలిగిన వన్య ప్రాణులకు ఆహారం, తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీంతో వాటిని వెతుక్కుంటూ వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన సంరక్షణ సమితుల పనితీరును మెరుగుపరచాలి. స్వార్థపర శక్తుల చేతుల్లో పడి అటవీ ప్రాంతాలు నాశనమై పోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిరంతరం అటవీ ప్రాంతాల్లో నిఘా ఉంచడమే కాకుండా, అటవీ చట్టాలను సైతం కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచ్చలవిడిగా నరికివేత అడవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైఫల్యమే అవి విస్తరించకపోవడానికి కారణమవుతోంది. దీనికి తోడు కొన్నేళ్లుగా స్మగ్లర్లు వృక్ష సంపదను యథేచ్ఛగా దోచుకోవడంతోపాటు, అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. వారం క్రితం తాడిమర్రి మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలో టీడీపీకి చెందిన కొందరు కబ్జా చేసేందుకు భూమిని చదును చేస్తుండగా, స్థానికులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు దాడి చేసి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో 540 హెక్టార్లు, ఎల్లుట్ల రిజర్వులో 150 హెక్టార్ల మేర దురాక్రమణకు గురైనట్లు అధికారులు చెబుతున్నా.. రికార్డులకు ఎక్కని ఆక్రమణలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ చర్యలు తీసుకుంటున్నాం అడవుల పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఏటా మొక్కలు నాటుతున్నా.. కొంత మంది వాటిని ధ్వంసం చేస్తున్నారు. 2014-15లో 600 హెక్టార్లలో 5.50 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నాం. అడవుల నరికివేతను అరికట్టేందుకు కట్టుదిట్టమైనప్రణాళిక రూపొందిస్తున్నాం. - రాఘవయ్య, డీఎఫ్ఓ, అనంతపురం