రక్షణ, పర్యవేక్షణ లేకే ప్రమాదం
మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : శాంతిఖని గని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడమే కాకుండా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగింద నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రస్తుతం గనిలో పనిచేస్తున్న ఓవర్‌మెన్, సర్దార్, అండర్ మేనేజర్, సంబంధిత అధికారులు, సూపర్‌వైజర్లలో చాలా మంది జూనియర్లే కావడంతో ప్రమాదాన్ని పసిగట్ట లేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జంక్షన్‌లో రక్షణ
ప్రమాదం జరిగిన 52 లెవల్, ఒకటో డీప్ జంక్షన్‌లో క్రాస్‌బార్‌లో కనీసం మూడు దిమ్మలైనా బండ, సిమెంటుతో కట్టాలి. సరైన కొలతలతో ైసైడుల్లో రంధ్రాలు చేసి 5ఁ10 లేదా 6ఁ12 ఇంచుల సైజు గలిగిన గడ్డర్లు ఎక్కించి వాటిపై లైటుబార్లు లేదా 4ఁ8 బార్లు పెట్టి వాటిపై దిమ్మెలు కట్టి లాగింగ్ చేయాలి. సైడ్‌వాల్‌లు బలహీనంగా ఉంటే సైడుల లో మేసనరీ లై నింగ్ లేద పిన్నులు బిగించి వాటిపై బార్లు లేద గర్డర్‌లు పెట్టి సపోర్లు చేయాలి. నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు కట్టి వాటిపై గర్డర్‌లతో సపోర్డు ఏర్పాటు చేస్తే పైకప్పు కూలకుండా ఉం టుంది. దిమ్మెల నిర్మాణం సుమారు 30 టన్నుల బరువును ఆపుతుంది. పది చదరపు మీటర్ల ఏరియా ను సపోర్టు చే స్తుంది. ర క్షణ చర్యలు చేపట్టినప్పటికీ నిత్యం సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉం టుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన జంక్షన్‌లో ఏ ఒక్క ర క్షణ నిర్మాణం చేపట్టకపోవడం వల్లే కార్మికు లు ప్రాణాలను కోల్పోయారని తెలుస్తోంది.
ప్రాణం పోసిన హెచ్చరిక
ప్రమాదం జరిగిన బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఐదు నిమిషాల ముందు రక్షణ అధికారి హెచ్చరిక తోటి కార్మికులకు ప్రాణం పోసింది. జంక్షన్ వద్దకు సుమారు 25 మంది కార్మికులు నీరు తాగడానికి వచ్చారు. ఆ స్థలంలో చల్లని గాలి వస్తుండడంతో కొద్దిసేపు సేదతీరుతామని అనుకున్నారు. ఇంతలోనే గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటు వైపుగా వచ్చి ‘ఇక్కడ ఏం చేస్తున్నారు.. పనికి వెల్లండి’.. అంటూ హెచ్చరించారు. దీంతో కార్మికులు పనులకు వెళ్లిపోయూరు. తర్వాత కొద్ది నిమిషాల్లోనే అక్కడ పైకప్పు(బండ) కూలింది. వచ్చిన అధికారి కార్మికులతో మాట్లాడుకుంటూ నిలబడినా 26 మంది ప్రాణాలు పోయేవి. ఒక వేళ ఆ అధికారి రాకపోరుునా 25 మంది ప్రాణాలు బండ కింద నలిగిపోయేవి.