
పట్నా: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల నీట మునిగి ఆదివారం 9 మంది మృతి చెందారు. రఘోపూర్ బ్లాక్‌లోని మస్తానా ఘాట్‌లో పూడిక మట్టితో ఏర్పడిన ఓ దిబ్బపై విహార యాత్రకు వచ్చిన వారు గుమిగూడినపుడు వైశాలి ఘటన జరిగింది. తొలుత ఓ చిన్నారి నదిలో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు మిగిలిన వారు కూడా నీటిలో దూకారు. ఈ క్రమంలో ఐదుగురు బాలికలు, ఒక మహిళ చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం నితీశ్ కుమార్ కార్యాలయం ప్రకటించింది. ఇక, సమస్తిపూర్ ఘటనలో మధురాపూర్ ధరమ్‌పూర్ ఘాట్ సమీపంలో 12 మందితో వెళ్తున్న పడవ భాగమతి నదిలో మునిగిపోవడంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment