in water
-
బిహార్‌లో 9 మంది జల సమాధి
పట్నా: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల నీట మునిగి ఆదివారం 9 మంది మృతి చెందారు. రఘోపూర్ బ్లాక్‌లోని మస్తానా ఘాట్‌లో పూడిక మట్టితో ఏర్పడిన ఓ దిబ్బపై విహార యాత్రకు వచ్చిన వారు గుమిగూడినపుడు వైశాలి ఘటన జరిగింది. తొలుత ఓ చిన్నారి నదిలో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు మిగిలిన వారు కూడా నీటిలో దూకారు. ఈ క్రమంలో ఐదుగురు బాలికలు, ఒక మహిళ చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం నితీశ్ కుమార్ కార్యాలయం ప్రకటించింది. ఇక, సమస్తిపూర్ ఘటనలో మధురాపూర్ ధరమ్‌పూర్ ఘాట్ సమీపంలో 12 మందితో వెళ్తున్న పడవ భాగమతి నదిలో మునిగిపోవడంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు. -
మునిగిన బతుకు పడవ
బోడసకుర్రు పల్లెపాలెంలో విషాదం ఉపాధి కోసం వెళ్లి ఇద్దరు ఇసుక కార్మికుల మృతి బోడసకుర్రు (అమలాపురం టౌ¯ŒS): ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులైన ఇద్దరు ఇసుక కార్మికులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడటంతో అల్లవరం మండలం బోడసకుర్రు శివారు పల్లిపాలెంలో శుక్రవారం విషాదం అలుముకుంది. ఆ గ్రామానికి చెందిన గోదావరిలో మునిగి ఇసుక తవ్వే కార్మికులు కొప్పాడి పెద సత్యానారయణ (50), మల్లాడి సత్యనారాయణ (60)లు మలికిపురం మండలం తూర్పుపాలంలో శంకరగుప్తం డ్రెయి¯ŒS (కౌశిక)లో పాత పడ్డ వంతెన స్తంభాలకు ఇసుక పడవ ఢీకొట్టిన ప్రమాదంతో మృతి చెందారు.బోడసకుర్రులో అనేక మంది మత్స్యకారులకు ప్రతి రోజూ తెల్లవారు జాము వైనతేయ నదిలో మునిగి బకెట్లు, గమేళాలతో ఇసుకను అతికష్టంగా తవ్వి పైకి తెచ్చి పడవలో పోస్తారు. ఆ ఇసుకను అమ్ముకుని జీవించటం వారి ఉపాధి. వీరు శుక్రవారం ఉదయమే నదిలో మునిగి ఇసుకను సేకరించి పడవలో తూర్పపాలెం వైపు వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తమ పాలేనికి చెందిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందటం. .మరో ఇద్దరు మత్య్సకారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. రోజూ ఇసుక తవ్వి సాయంత్రానికి తెచ్చే ఆదాయంతోనే వారి బతుకు పడవ సాగుతోంది.శిధిలావస్థలో ఉన్న ఈ వంతెన వారి పట్ల మృత్యువై మింగేసిందని విలపిస్తున్నారు. మృతుడు పెద సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద దిక్కు చనిపోవటంతో అతని భార్య సావిత్రి కన్నీరుమున్నీరవుతోంది. మరో మృతుడు సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఉపాధి కోసం వెళితే ప్రమాదం జల సమాధి చేసిందని వాపోయారు బోడసకుర్రులోని ఇసుక తవ్వే కార్మికులంతా పనులు వదిలేసి తోటి కార్మికులు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
‘నీరు’కేళం కాదు సుమా..
అమలాపురం : కొబ్బరిని ‘నారికేళం’ అని కూడా అంటారు. తోటల్లో, గట్లపై, పెరళ్లలో పెరిగే ఈ చెట్ల మెుదళ్లలో నీరు ఎక్కువైతే వేర్లు దెబ్బతిని చెట్టు చనిపోయే అవకాశముంది. అలాంటిది మెువ్వు వరకూ చెరువులో మునిగిన ఈ ఫొటోలోని కొబ్బరిచెట్టు ‘ఎలా బతికి ఉందో?’ అనిపిస్తుంది. అసలు సంగతేమిటంటే.. తల తప్ప నిలువెల్లా నీట మునిగినట్టు కనిపిస్తున్న ఈ చెట్టు మెుదలు చెరువులో కాక గట్టున ఉంది. అయితే.. వంపులు తిరిగిన చెట్టు చెరువులోకి ఒరిగిపోవడంతో కాండంలో చాలాభాగం నీట మునిగి, తలభాగం చెరువు మధ్యలో కనిపిస్తోంది. అంతరచిత్రం చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. అంబాజీపేట శివారు భేతాళస్వామి గుడి సమీపంలోని చెరువులో ఈ తమాషా దృశ్యాన్ని చూడవచ్చు. -
బాలుడిని మింగిన నీటిసంపు
కిష్టాపురం(సత్తుపల్లి రూరల్) : ఆడుకుంటూ వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కిష్టాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముల్లగిరి వీరేంద్రబాబు, జ్యోతి దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. జ్యోతి ఎదురింట్లో సంపు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటుండగా.. అక్కడికి ఆడుకుంటూ వచ్చిన జయవర్ధన్(3) ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లి బాబును బయటకు తీసి.. చుట్టుపక్కల వారిని పిలిచి హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే జయవర్ధన్ మృతిచెందాడని తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 24ఎస్పిఎల్41 : మృతిచెందిన జయవర్ధన్