మునిగిన బతుకు పడవ
-
బోడసకుర్రు పల్లెపాలెంలో విషాదం
-
ఉపాధి కోసం వెళ్లి ఇద్దరు ఇసుక కార్మికుల మృతి
బోడసకుర్రు (అమలాపురం టౌ¯ŒS):
ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులైన ఇద్దరు ఇసుక కార్మికులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడటంతో అల్లవరం మండలం బోడసకుర్రు శివారు పల్లిపాలెంలో శుక్రవారం విషాదం అలుముకుంది. ఆ గ్రామానికి చెందిన గోదావరిలో మునిగి ఇసుక తవ్వే కార్మికులు కొప్పాడి పెద సత్యానారయణ (50), మల్లాడి సత్యనారాయణ (60)లు మలికిపురం మండలం తూర్పుపాలంలో శంకరగుప్తం డ్రెయి¯ŒS (కౌశిక)లో పాత పడ్డ వంతెన స్తంభాలకు ఇసుక పడవ ఢీకొట్టిన ప్రమాదంతో మృతి చెందారు.బోడసకుర్రులో అనేక మంది మత్స్యకారులకు ప్రతి రోజూ తెల్లవారు జాము వైనతేయ నదిలో మునిగి బకెట్లు, గమేళాలతో ఇసుకను అతికష్టంగా తవ్వి పైకి తెచ్చి పడవలో పోస్తారు. ఆ ఇసుకను అమ్ముకుని జీవించటం వారి ఉపాధి. వీరు శుక్రవారం ఉదయమే నదిలో మునిగి ఇసుకను సేకరించి పడవలో తూర్పపాలెం వైపు వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తమ పాలేనికి చెందిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందటం. .మరో ఇద్దరు మత్య్సకారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. రోజూ ఇసుక తవ్వి సాయంత్రానికి తెచ్చే ఆదాయంతోనే వారి బతుకు పడవ సాగుతోంది.శిధిలావస్థలో ఉన్న ఈ వంతెన వారి పట్ల మృత్యువై మింగేసిందని విలపిస్తున్నారు. మృతుడు పెద సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద దిక్కు చనిపోవటంతో అతని భార్య సావిత్రి కన్నీరుమున్నీరవుతోంది. మరో మృతుడు సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఉపాధి కోసం వెళితే ప్రమాదం జల సమాధి చేసిందని వాపోయారు బోడసకుర్రులోని ఇసుక తవ్వే కార్మికులంతా పనులు వదిలేసి తోటి కార్మికులు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.