సాక్షి, కర్నూలు: ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అసౌకర్యాలతో ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. అవినీతి మాటున కనీస సౌకర్యాలకు ఇవి నోచుకోవడంలేదు. ఏటా లక్షలాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా కర్నూలు నగరంతోపాటు జిల్లాలో పట్టణ, మండల కేంద్రాల్లో నందనవనాలు బాగుపడటం లేదు. నగర, పట్టణ జీవనంలో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే జనానికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచేవివే. పిల్లాపాపలతో కాసింత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేసే వీటి ప్రాధాన్యం చెప్పలేం. ఇలాంటి వాటి స్థితిగతులపై సాక్షి బృందం పరిశీలన చేసింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న కొన్నింటిని నమూనాగా తీసుకొని తీరుతెన్నులను పరిశీలించగా.. నివ్వెరపోయే నిజాలెన్నో వెలుగు చూశాయి. మన అధికారుల ఉదాసీనం, అవినీతి.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. వెరసి పార్కుల ప్ర‘గతి’కి శాపంగా మారాయి. స్ఙానికంగా ఉన్న వాటిలో కనీస వసతులు కూడా లేవు.
అలంకార ప్రాయం
ఎమ్మిగనూరు పట్టణంలో వూచాని సోవుప్ప (పెద్దపార్క్) పార్క్‌ను దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. మొదట్లో పార్కు ఎంతో సుందరంగా ఉండేది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడేది. సందర్శకుల కోసం పార్కులో ప్రత్యేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ఊగే ఊయలలు, జారుడు బల్లలు, ఇతర ఆటవస్తువులు అందుబాటులో ఉండేవి. అయితే పదేళ్లుగా వుున్సిపల్ పాలకులు, అధికారులు దీనిని బాగోగులు పట్టించుకోవడం వూనేశారు. దీంతో పచ్చిక బయళ్లు.. చెట్లు, అలంకార మొక్కలు పూర్తిగా నాశనం అయ్యాయి. పిచ్చిమొక్కలు పెరిగాయి. పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు పూర్తిగా పాడైపోయాయి. ఇక నందమూరి తారక రామారావు పార్కు(చిన్నపార్క్) నిర్వహణ గాలికొదిలేయడంతో అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
స్థలానికే పరిమితం
మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నగర పంచాయతీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పట్ణణం ఒక పార్కుకు కూడా నోచుకోలేదు. పట్ణణ ప్రజలు సేదతీరాలంటే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానం లేదా ఆర్టీసీ బస్టాండే పార్కులా ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తికాదు. అయితే పార్కు కోసం అధికారులు స్థలం గుర్తించినా కార్యారూపం దాల్చకపోవడంతో ఆ స్థలం నేడు పండ్లవ్యాపారులకు చెత్తకుండీగా ఉపయోగపదుతోంది. ఆహ్లాదంగా గడపాలని భావించే వారు ఇక్కడికి చేరువలోనే ఉన్న శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. అలాగే నల్లకాల్వ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శిస్తున్నారు.
ఆదరణ కరువు
పదేళ్ల కిందట బనగానపల్లెలో ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ‘ఉయ్యాలవాడ నరసంహారెడ్డి’ పార్కుకు నేడు ఆదరణ కరువైంది. వాటర్ ఫౌంటైన్, వాటర్‌పాల్, కలర్ లైటింగ్ సహా చిన్నారుల కోసం ఎన్నో ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ పార్కు సందర్శించే వారి నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేశారు. అయితే ఐదేళ్లుగా ఈ పార్కు నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. వాటర్ ఫౌంటైన్, వాటర్ పాల్, కలర్ లైటింగ్‌లు పనిచేయడం లేదు. చిన్నారుల ఆట స్థలం నిరుపయోగంగా మారింది.
పచ్చదనం మాయం
డోన్ పట్టణం కేవీఎస్ కాలనీలో మున్సిపాల్ పార్కు అభివృద్ధి జరిగినా నీరులేక పచ్చదనం కరువైంది. పిల్లలు ఆడుకునేందుకు తగిన ఆట వస్తులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు పిల్లాపాపలతో అక్కడికి వెళ్లలేకపోతున్నారు.
వసతులేమి.. కోవెలకుంట్ల పట్టణంలోని గ్రామ పంచాయతీ పక్కన ఏర్పాటు చేసిన బీవీ సుబ్బారెడ్డి మెమోరియల్ పార్కులోమౌలిక వసతులు కరువయ్యాయి. 90 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ పార్కును రెండేళ్ల కిందట సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం ఈ పార్కులోకి ప్రజలకు ప్రవేశముంటుంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడకు వచ్చే మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆహ్లాదం..అందనంత దూరం
Published Thu, Dec 26 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement