గుళ్లు కూల్చినందుకు క్షమించండి
అయితే నెలరోజులు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేరకపోవటంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, స్వామీజీ శ్రీ జమునాదాస్, çశృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద తీర్థస్వామి అలంకార్ సెంటర్‌లో నిరాహారదీక్ష చేపట్టారు. వీరితోపాటు ఎల్లాప్రగడ విజయలక్ష్మి, బెహరా చందన్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనను విరమింపజేసేందుకు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. శ్రీరామాలయం, శ్రీఅభయాంజనేయస్వామి, శనేశ్వరాలయాల నిర్మాణానికి నగరంలోని రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయించనున్నట్లు స్వామీజీలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ఆలయాల కూల్చివేతకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు కోరారు. ఇకపై ఆలయాలను తొలగించాల్సి వస్తే స్వామీజీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నిరసన చేస్తున్న స్వామీజీలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.