నా బలం, బలహీనత తనే : ప్రియాంక చోప్రా | Priyanka Chopra Says Her Mother Is Her Strength | Sakshi
Sakshi News home page

నా బలం, బలహీనత తనే : ప్రియాంక చోప్రా

Published Sat, Jun 16 2018 1:32 PM | Last Updated on Sat, Jun 16 2018 1:39 PM

Priyanka Chopra Says Her Mother Is Her Strength - Sakshi

తల్లితో ప్రియాంక చోప్రా (పాత ఫొటో)

నా బలం, బలహీనత రెండూ మా అమ్మే అంటున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా. తన తల్లి మధు చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. ‘అందమైన మహిళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా బలం, బలహీనత రెండూ ఒక్కరే. నీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నీతో కలిసి వేడుక చేసుకునేందుకు వేచి చూస్తున్నాను అమ్మా’  అంటూ ప్రేమపూర్వక సందేశాన్ని ఫొటోకు జతచేశారు.

అయితే గత కొన్ని రోజులుగా హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌తో ప్రియాంక ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట్లో వార్తలు ప్రచారం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల నిక్‌ జోనాస్‌తో కలిసి అతడి బంధువుల పెళ్లికి వెళ్లి ఆ వార్తలకు బలం చేకూర్చారు ప్రియాంక. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రియాంక తల్లి మధు చోప్రా సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఒకవేళ నిక్‌తో ప్రియాంక పెళ్లికి సిద్ధపడితే అందుకు తాను ఒప్పుకోనని చెప్పారు. విదేశీయుడిని ప్రియాంక పెళ్లి చేసుకుంటే తాను భరించలేనన్నారు. ప్రియాంక జీవితాంతం వివాహం చేసుకోకపోయినా తనకు ఇష్టమే కానీ, విదేశీయుడిని చేసుకోవడానికి మాత్రం అంగీకరించనని ఆమె పేర్కొన్నారు. అయితే నిక్‌తో ప్రేమ వ్యవహారంపై గానీ, తల్లి అభిప్రాయంపై గానీ ప్రియాంక ఇంతవరకు స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement