మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల్లో అడుగుపెట్టింది. దళపతి విజయ్ 'తమిళన్' చిత్రంతో వెండితెరపై కథానాయికగా మెరిసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న కోరిక, ఇష్టం ప్రియాంకకు అస్సలు ఉండేది కాదని చెప్తోంది ఆమె తల్లి మధు చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రియాంక ఎన్నడూ అనుకోలేదు. ఆమెకు తొలిసారి సౌత్ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది.
ఛాన్స్ మిస్ చేసుకోవద్దని..
ఆ విషయం తనకు చెప్తే ఏడ్చేసింది. నేను సినిమాలు చేయనని కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పాను. అలా తమిళన్ చిత్రానికి సంతకం చేసింది. షూటింగ్ చేస్తుండేకొద్దీ తనకు యాక్టింగ్ మీద ఆసక్తి, ఇష్టం ఏర్పడింది. భాష రాకపోయినా ఎంజాయ్ చేసింది. చిత్రయూనిట్ కూడా తనను ఎంతో బాగా చూసుకుంది. హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనొక జెంటిల్‌మెన్. ఈ మూవీలో రాజు సుందరం కొరియోగ్రాఫర్.
డ్యాన్స్ రాదు
ప్రియాంకకు పెద్దగా డ్యాన్స్ రాదు. విజయ్‌తో స్టెప్పులేసేందుకు చాలా కష్టపడింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొరియోగ్రాఫర్‌తో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఇష్టంగా పని నేర్చుకుంది. ఆ వాతావరణం నచ్చడంతో సినిమాను కెరీర్‌గా ఎంచుకుంది అని తెలిపింది. తమిళ్‌లో ఒకే ఒక్క సినిమా చేసిన ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. అనంతరం హాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది.
చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని
Comments
Please login to add a commentAdd a comment