కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్‌ ఆంటోని | Vijay Antony Did Not Wear Slippers | Sakshi
Sakshi News home page

Vijay Antony: కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్‌ ఆంటోని

Published Thu, May 30 2024 7:29 AM | Last Updated on Thu, May 30 2024 1:56 PM

Vijay Antony Did Not Wear Slippers

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్‌ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్‌ హీరో, డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు.

విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్‌'. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ విడుదల కార్యక్రమంలో విజయ్‌ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్‌ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. 

ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం  చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. 

టాలీవుడ్‌లో జాతి రత్నాలు  సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement